Breaking News

బంగ్లాదేశ్ క్రికెట‌ర్ల వాహ‌నాల‌పై దాడి!

Published on Fri, 10/17/2025 - 09:01

యూఏఈ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 3-0 తేడాతో బంగ్లాదేశ్ వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న బంగ్లా టైగర్స్‌.. వన్డేల్లో మాత్రం ప్రత్యర్ధి ముందు పూర్తిగా తేలిపోయారు. మెహిదీ హసన్ మిరాజ్ నాయకత్వంలోని బంగ్లా జట్టు మొదటి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోగా, రెండో వన్డేలో 81 పరుగులు, చివరి మ్యాచ్‌లో 200 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.

అయితే యూఏఈ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన బంగ్లా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. అఫ్గాన్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన బంగ్లా అభిమానులు మెహదీ బృందంపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. తొలుత  విమానాశ్రయంలో ఆటగాళ్లను ఫ్యాన్స్ హేళన చేయగా.. అనంతరం వారు ప్రయత్నిస్తున్న వాహనాలపై దాడి చేసి నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో  బంగ్లాదేశ్ ఆటగాడు మొహమ్మద్ నయీమ్ షేఖ్ సోషల్ మీడియాలో భావోద్వేగ నోట్‌ను షేర్ చేశాడు.

"మేము మైదానంలో దేశం బ‌రువు బాధ్య‌త‌ల‌నూ మోస్తూ ఆడుతున్నాము. ఎరుపు-ఆకుపచ్చ జెండా మా జెర్సీలపైనే కాదు, మా రక్తంలో కూడా ఉంది. దేశం గర్వపడేలా ఆడేందుకు ప్రతీ మ్యాచ్‌లోనూ  ప్రయత్నిస్తాం. ప్రతీ క్రీడలోనూ గెలుపోటములు సహజం. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం.

మీరు కూడా దేశాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మేము  ఓడిపోయినప్పుడు బాధ కలుగుతుందని నాకు తెలుసు. కానీ మాపై అంత ద్వేషం చూపడం సరికాదు. వాహనాలపై దాడులు నన్ను తీవ్రంగా బాధించాయి. మేము మళ్లీ తిరిగి బలంగా పుంజుకుంటామని" నయీమ్ పేర్కొన్నాడు. కాగా అఫ్గాన్ చేతిలో వైట్‌వాష్ అయిన తొలి ఆసియా జట్టుగా బంగ్లాదేశ్ చెత్త రికార్డు మూట కట్టుకుంది.
చదవండి: IND vs SA: ఇండియా టూర్‌.. సౌతాఫ్రికా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! కెప్టెన్ ఎవ‌రంటే?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)