స్టార్‌ క్రికెటర్‌కు గుండెపోటు.. పరిస్థితి విషమం

Published on Mon, 03/24/2025 - 14:01

బంగ్లాదేశ్‌ దిగ్గజ బ్యాటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌కు (36) ఇవాళ (మార్చి 23) ఉదయం గుండెపోటు వచ్చింది. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాచ్‌ ఆడుతుండగా తమీమ్‌ తీవ్రమైన ఛాతీ నొప్పికి గురయ్యాడు. దీంతో అతన్ని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తమీమ్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

ప్రస్తుతం అతనికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. తమీమ్‌ గుండె ధమనాల్లో పూడికలు ఉన్నట్లు తెలుస్తుంది. తమీమ్‌ ఇవాళ ఉదయమే రెండు సార్లు ఛాతీ నొప్పికి గురైనట్లు సమాచారం. తమీమ్‌ పరిస్థితి తెలిసి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు తమ కార్యకలాపాలన్నిటినీ వాయిదా వేసుకుంది. బోర్డు డైరెక్టర్లు తమీమ్‌ను చూసేందుకు ఆసుపత్రికి క్యూ కట్టారు.

తమీమ్‌ బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో అత్యంత సఫలమైన ఆటగాడు. తమీమ్‌ 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ప్రస్తుతం అతను లోకల్‌ క్రికెట్ ఆడుతూ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. తమీమ్‌ పేరిట బంగ్లాదేశ్‌ క్రికెట్‌కు సంబంధించి ఎన్నో రికార్డులు ఉన్నాయి. 

తమీమ్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో (మూడు ఫార్మాట్లలో) 15000 పైచిలుకు పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలో ఇన్ని పరుగులు ఎవరూ చేయలేదు. తమీమ్‌ బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు కలిగి ఉన్నాడు. తమీమ్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 25 సెంచరీలు బాదాడు. తమీమ్‌ 2020-2023 వరకు బంగ్లాదేశ్‌ వన్డే జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

 

 

 

 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)