Breaking News

అభిమాని చెంప చెల్లుమనిపించిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌

Published on Mon, 01/08/2024 - 11:37

బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌, ఆ జట్టు కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ మరోసారి తన దురుసు ప్రవర్తన కారణంగా వార్తల్లో నిలిచాడు. ఆన్‌ ద ఫీల్డ్‌, ఆఫ్‌ ద ఫీల్డ్‌ అన్న తేడా లేకుండా తరుచూ గొడవలకు దిగే షకీబ్‌.. తాజాగా ఓ అభిమాని చెంప చెల్లుమనిపించాడు. ఇటీవలే రాజకీయాల్లోకి దిగి అవామీ లీగ్‌ అనే పార్టీ తరఫున మగుర 1 నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన షకీబ్‌.. పోలింగ్‌ రోజున సొంత అభిమానిపై చేయి చేసుకున్నాడు.

ఓ పోలింగ్‌ స్టేషన్‌ సందర్శనకు వెళ్లిన షకీబ్‌ను సదరు అభిమాని వెనక నుంచి నెట్టడంతో సహనం కోల్పోయి  కొట్టినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుత​ం నెట్టింట వైరలవుతుంది. కాగా, బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో షకీబ్‌ ఎంపీగా గెలిచాడు. షకీబ్‌ తన సమీప ప్రత్యర్ధి ఖాజీ రేజౌల్‌ హొస్సేన్‌పై 1,50,000కు పైగా ఓట్ల తేడాతో గెలిచాడు. ఈ ఎన్నికల్లో షకీబ్‌ పార్టీ అవామీ లీగ్‌ మళ్లీ అధికారంలోకి వచ్చినట్లు బంగ్లాదేశ్‌ మీడియా అంటుంది.

అవామీ లీగ్‌ 300 సీట్లలో 200 పై చిలుకు సీట్లు గెలిచినట్లు అక్కడి మీడియా చెబుతుంది. పూర్తి ఫలితాలు రావాల్సి ఉంది. అవామీ లీగ్‌ అనే పార్టీ ప్రస్తుత బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ. అవామీ లీగ్‌ మరో సారి పూర్తి మెజార్టీ సాధించడంతో షేక్‌ హసీనానే మళ్లీ ప్రధాన పదవి చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, షకీబ్‌ ఎన్నికల కోసం క్రికెట్‌ నుంచి తాత్కాలికంగా విరామం తీసుకున్నాడు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)