Breaking News

బౌలర్ల ప్రతాపం.. పట్టుబిగించిన బంగ్లాదేశ్‌

Published on Thu, 06/15/2023 - 15:19

ఓ టెస్ట్‌ మ్యాచ్‌, 3 వన్డేలు, 2 టీ20ల సిరీస్‌ల కోసం​ ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. పర్యటనలో భాగంగా నిన్న (జూన్‌ 14) మొదలైన టెస్ట్‌ మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు పట్టుబిగించింది. రెండో రోజు ఆట సమయానికి ఆ జట్టు 370 పరుగుల ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్‌ను (134/1) కొనసాగిస్తోంది. మహ్మదుల్‌ హసన్‌ జాయ్‌ (17) ఔట్‌ కాగా.. జకీర్‌ హసన్‌ (54), నజ్ముల్‌ హసన్‌ షాంటో (54) క్రీజ్‌లో ఉన్నారు.

దీనికి ముందు బంగ్లా బౌలర్లు విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకు చాపచుట్టేసింది. ఎబాదత్‌ హొసేన్‌ (4/47), షొరీఫుల్‌ ఇస్లాం (2/28), తైజుల్‌ ఇస్లాం (2/7), మెహిది హసన్‌ మీరజ్‌ (2/15) మూకుమ్మడిగా రాణించి, ఆఫ్ఘనిస్తాన్‌ పతనాన్ని శాసించారు. ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో అబ్దుల్‌ మలిక్‌ (17), నసిర్‌ జమాల్‌ (35), జజాయ్‌ (36), కరీమ్‌ జనత్‌ (23) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.

అంతకుముందు బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులకు ఆలౌటైంది. నజ్ముల్‌ హసన్‌ షాంటో (146) సెంచరీతో కదంతొక్కగా.. మహ్మదుల్‌ హసన్‌ (75), ముష్ఫికర్‌ రహీమ్‌ (47), మెహిది హసన్‌ మీరజ్‌ (48) రాణించారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో నిజత్‌ మసూద్‌ 5 వికెట్లతో చెలరేగగా.. అహ్మద్‌జాయ్‌ 2, జహీర​ ఖాన్‌, అమీర్‌ హమ్జా, రహ్మత్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 
 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)