పరువు కాపాడుకున్న బంగ్లాదేశ్‌

Published on Sat, 07/11/2026 - 20:35

జింబాబ్వే పర్యటనలో బంగ్లాదేశ్‌ జట్టు ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. ఈ పర్యటనలో తొలుత జరిగిన ఏకైక టెస్ట్‌లో ఘోరంగా ఓడిన ఆతిథ్య జట్టు.. ఆతర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి 0-2తో సిరీస్‌ కోల్పోయింది. 

అయితే ఇవాళ (జులై 11) జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో విజయం సాధించిన బంగ్లాదేశ్‌, సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ కాకుండా పరువు కాపాడుకుంది.

హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత జింబాబ్వే 48.1 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బంగ్లాదేశ్‌ 36 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

తంజిద్‌ హసన్‌ తంజిమ్‌ 101 బంతుల్లో 3 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 94 పరుగులు చేసి బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో ఓపెనర్‌ సౌమ్య సర్కార్‌ (69) కూడా అర్ద సెంచరీతో రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో మసుకు 2, చివంగ ఓ వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు షోరిఫుల్‌ ఇస్లాం (10-1-44-4), తస్కిన్‌ అహ్మద్‌ (10-4-32-2), తన్వీర్‌ ఇస్లాం (10-0-37-2), మొహమ్మద్‌ సైఫుద్దీన్‌ (9.1-1-31-1) ధాటి​కి జింబాబ్వే 199 పరుగులకే ఆలౌటైంది. 

జింబాబ్వే ఇన్నింగ్స్‌లో వెస్లీ మెదెవెరె (75), బ్రాడ్‌ ఈవాన్స్‌ (50) అర్ద సెంచరీలతో రాణించారు. వీరు మినహా ఆ జట్టులో ఎవరూ రాణించలేదు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జులై 15, 17, 19 తేదీల్లో బులవాయో వేదికగా జరుగునుంది.

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)