Breaking News

ప్రతీకారం తీర్చుకున్న బంగ్లాదేశ్‌

Published on Fri, 07/17/2026 - 19:39

జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (జులై 17) జరిగిన రెండో టీ20లో పర్యాటక జింబాబ్వే 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకొని, సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలి టీ20లో జింబాబ్వే బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్‌ హస్సన్‌ (55), తంజిద్‌ హసన్‌ తమీమ్‌ (58) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో యాసిర్‌ అలీ (22 నాటౌట​్‌), సైఫుద్దీన్‌ (31 నాటౌట్‌) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ, ఈవాన్స్‌ తలో 2 వికెట్లు తీయగా.. సికందర్‌ రజా ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. రిషద్‌ హొస్సేన్‌ (4-26), మెహిది హసన్‌ (3-24) ధాటి​​ఇ 19.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. నహిద్‌ రాణా, సైఫుద్దీన్‌ , సైఫ్‌ హస్సన్‌ తలో వికెట్‌ తీశారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయారు. సికందర్‌ రజా (28), బ్రాడ్‌ ఈవాన్స్‌ (25), ర్యాన్‌ బర్ల్‌ (29) తేలికపాటి మెరుపులు మెరిపించారు. 

నిర్ణయాత్మక మూడో టీ20 జులై 19న జరుగనుంది. కాగా, ఈ సిరీస్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో, ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో జింబాబ్వే బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ గెలవడంతో పాటు వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

 

 

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)