Breaking News

శ్రీలంకకు షాకిచ్చిన బంగ్లాదేశ్‌

Published on Wed, 03/06/2024 - 21:47

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 6) జరిగిన రెండో మ్యాచ్‌లో పర్యాటక​ శ్రీలంకకు ఆతిథ్య బంగ్లాదేశ్‌ ఊహించని షాకిచ్చింది. అన్ని విభాగాల్లో తమకంటే మెరుగైన శ్రీలంకను బంగ్లాదేశ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్‌ ఆడుతూ పాడుతూ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. 

కెప్టెన్‌ నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో అజేయ అర్దసెంచరీతో (53), తౌహిద్‌ హ్రిదోయ్‌ అజేయమైన 32 పరుగులతో బంగ్లాదేశ్‌ను విజయతీరాలకు చేర్చారు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో లిటన్‌ దాస్‌ (36), సౌమ్య సర్కార్‌ (26) కూడా ఓ మోస్తరుగా రాణించారు. బంగ్లాదేశ్‌ కోల్పోయిన రెండు వికెట్లు మతీశ పతిరణ ఖాతాలోకి వెళ్లాయి. 

అంతకుముందు శ్రీలంక ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్క భారీ స్కోర్‌ కూడా నమోదు కాలేదు. అవిష్క ఫెర్నాండో 0, కుశాల్‌ మెండిస్‌ 36, కమిందు మెండిస్‌ 37, సమరవిక్రమ 7, అసలంక 28, మాథ్యూస్‌ 32 నాటౌట్‌, షనక 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌, మెహిది హసన్‌, ముస్తాఫిజుర్‌, సౌమ్య సర్కార్‌ తలో వికెట్‌ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో శ్రీలంక గెలుపొందింది. నిర్ణయాత్మక మూడో టీ20 మార్చి 9న జరుగనుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)