Breaking News

పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్‌

Published on Wed, 03/11/2026 - 17:43

టీ20 ప్రపంచకప్‌ 2026 నుంచి వైదొలిగే విషయంలో తమకు అండగా ఉండినట్లు నటించి, చివరికి హ్యాండిచ్చిన పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్‌ జట్టు తగిన బుద్ది చెప్పింది. ప్రపంచకప్‌ తర్వాత జరిగిన తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి, 'మిత్రధర్మాన్ని' నిలబెట్టుకుంది. ఫ్రెండ్‌, ఫ్రెండ్‌ అంటూ.. బంగ్లాదేశ్‌ పాక్‌ను ఇంటి​కి పిలిచి మరీ దెబ్బ​కొట్టింది.

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 11) ఢాకా వేదికగా తొలి మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పాక్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌..  నహిద్‌ రాణా (7-0-24-5), ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ (4.4-0-18-1), తస్కిన్‌ అహ్మద్‌ (7-029-1), మెహిది హసన్‌ మిరాజ్‌ (10-0-29-3) ధాటికి 30.4 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.

పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్‌పై వన్డేల్లో ఇదే అత్యల్ప స్కోర్‌. 22 ఏళ్ల పేసర్‌ నహిద్‌ రాణా నిప్పులు చెరిగే బంతులతో పాక్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. స్వదేశంలో వన్డేల్లో పాకిస్తాన్‌పై ఓ బంగ్లాదేశ్‌ బౌలర్‌ నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు (5-24) ఇవే.

పాక్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్‌ ఆటగాడు ఫహీమ్‌ అష్రాఫ్‌ చేసిన 37 పరుగులే అత్యధికం. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో రెండు సెంచరీలతో చెలరేగిన సాహిబ్‌జాదా ఫర్హాన్‌ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు.

ఫహీమ్‌, ఫర్హాన్‌ కాక మాజ్‌ సదాకత్‌ (18), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. మిగతా పాక్‌ ప్లేయర్లలో హమిల్‌ హుసేన్‌ 4, సల్మాన్‌ అఘా 5, హుసేన్‌ తలాత్‌ 4, షాహీన్‌ అఫ్రిది 4 పరుగులు చేశారు. అబ్దుల్‌ సమద్‌, మొహమ్మద్‌ వసీ​ం​ జూనియర్‌ డకౌటయ్యారు.

అనంతరం 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ ఆడుతూపాడుతూ ఛేదించింది. కేవలం 15.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ తమీమ్‌ (42 బంతుల్లో 67 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పాక్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఊదేశాడు. 

మరో ఓపెనర్‌ సైఫ్‌ హసన్‌ 4 పరుగులకే ఔటైనా.. నజ్ముల్‌ హసన్‌ షాంటోతో (27) కలిసి బంగ్లాను గెలుపు తీరాలకు చేర్చాడు. అనంతరం లిటన్‌ దాస్‌ (3 నాటౌట్‌) సహకారంతో మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది, మొహమ్మద్‌ వసీం జూనియర్‌ తలో వికెట్‌ తీశారు. ఈ సిరీస్‌లోని రెండో వన్డే ఇదే వేదికగా మార్చి 13న జరుగనుంది.

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)