Breaking News

బంగ్లాదేశ్‌దే సిరీస్‌

Published on Wed, 12/03/2025 - 08:13

స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నిన్న (డిసెంబర్‌ 2) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ బంగ్లా బౌలర్ల ధాటికి 117 పరుగులకే ఆలౌటైంది. ముస్తాఫిజుర్‌, రిషద్‌ హొస్సేన్‌ తలో 3, షోరిఫుల్‌ 2, మెహిది హసన్‌, సైఫుద్దీన్‌ చెరో వికెట్‌ తీసి ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌, కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (38) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. టెక్టర్‌ (17), డాక్రెల్‌ (19), డెలాని (10) అతి కష్టంమీద రెండంకెల స్కోర్లు చేశారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ (55) అజేయ అర్ద సెంచరీతో బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు. 

అతనికి పర్వేజ్‌ హస్సేన్‌ ఎమోన్‌ (33 నాటౌట్‌) సహకరించాడు. అర్ద సెంచరీతో పాటు ఐదు క్యాచ్‌లు పట్టిన తంజిద్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.  కాగా, ఈ సిరీస్‌లో ఐర్లాండ్‌ తొలి మ్యాచ్‌ గెలువగా.. బంగ్లాదేశ్‌ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది.  

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)