Breaking News

‘ఐదు రోజులకు తీసుకెళ్లాలి’

Published on Mon, 09/16/2024 - 04:00

చెన్నై: భారత్‌తో రెండు టెస్టులు, ఆపై మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌ జట్టు భారత గడ్డపై ఆదివారం అడుగు పెట్టింది. ఢాకా నుంచి ఆటగాళ్ల బృందం తొలి టెస్టు వేదిక అయిన చెన్నైకి నేరుగా చేరుకుంది. తమ దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్‌ సిరీస్‌ కోసం భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌ జట్టుకు సెక్యూరిటీ కల్పించే విషయంలో బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. 

టీమ్‌ బస చేస్తున్న హోటల్‌లో బోర్డు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి బంగ్లాదేశ్‌ జట్టు ప్రాక్టీస్‌ మొదలు పెడుతుంది. 19 నుంచి ఇరు జట్ల మధ్య ఎంఎ చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు జరుగుతుంది. సీనియర్‌ ప్లేయర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ మినహా బంగ్లాదేశ్‌ ఆటగాళ్లంతా వచ్చారు. 

ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడుతున్న షకీబ్‌ టెస్టు సమయానికి నేరుగా చెన్నైకి చేరుకుంటాడు. భారత్‌కు బయల్దేరడానికి ముందు బంగ్లాదేశ్‌ కెప్టెన్నజు్మల్‌ హసన్‌ షంటో మీడియాతో మాట్లాడాడు. ‘పాకిస్తాన్‌పై సిరీస్‌ విజయంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. భారత్‌తో సిరీస్‌లో గట్టి పోటీ ఇవ్వగలం. 

టెస్టు మ్యాచ్‌లలో కుప్పకూలిపోకుండా ఆటను ఐదు రోజుల వరకు తీసుకెళ్లడం మా తొలి లక్ష్యం. భారత్‌తో సిరీస్‌ మాకు సవాల్‌. అందరిలాగే మేమూ అన్ని మ్యాచ్‌లు గెలవాలనే కోరుకుంటాం. మా బలానికి తగినట్లుగా ఆడటం ముఖ్యం. మా అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇవ్వాలి’ అని నజ్ముల్‌ చెప్పాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)