Breaking News

చరిత్ర సృష్టించిన లిట్టన్‌ దాస్‌

Published on Thu, 06/26/2025 - 21:11

బంగ్లాదేశ్‌ వికెట్‌కీపర్‌ లిట్టన్‌ దాస్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ల్లో  ఆ దేశం తరఫున అత్యధిక మంది ఔట్‌ చేయడంలో భాగమైన వికెట్‌ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో దినేశ్‌ చండీమల్‌ క్యాచ్‌ పట్టడం ద్వారా లిట్టన్‌ దాస్‌ ఈ ఘనత సాధించాడు. లిట్టన్‌కు ముందు బంగ్లాదేశ్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక డిస్మిసల్స్‌ రికార్డు ముష్ఫికర్‌ రహీం పేరిట ఉంది. 

ముష్ఫికర్‌ 99 ఇన్నింగ్స్‌ల్లో 113 డిస్మిసల్స్‌లో (98 క్యాచ్‌లు, 15 స్టంపౌట్లు) భాగంగా కాగా.. లిట్టన్‌ కేవలం​ 65 ఇన్నింగ్స్‌ల్లోనే (114) ముష్ఫికర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. లిట్టన్‌ డిస్మిసల్స్‌లో 99 క్యాచ్‌లుండగా.. 15 స్టంపౌట్లు ఉన్నాయి.

బంగ్లాదేశ్‌ తరఫున టెస్ట్‌ల్లో విజయవంతమైన టాప్‌-4 వికెట్‌ కీపర్లు..
లిట్టన్‌ దాస్‌-114
ముష్ఫికర్‌ రహీం-113
ఖలీద్‌ మసూద్‌-87
నురుల్‌ హసన్‌-34

మ్యాచ్‌ విషయానికొస్తే.. కొలొంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక పైచేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి, 43 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక (146) వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీ చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ ప్రభాత్‌ జయసూర్య (5) క్రీజ్‌లో ఉన్నాడు.

లంక ఇన్నింగ్స్‌లో దినేశ్‌ చండీమల్‌ (93) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. మరో ఓపెనర్‌ లహీరు ఉడారా 40 పరుగులతో రాణించాడు. తైజుల్‌ ఇస్లాం, నయీమ్‌ హసన్‌కు తలో వికెట్‌ దక్కింది.

అంతకుముందు బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి  8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌ ఇవాళ (రెండో రోజు) మరో 27 పరుగులు జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. 

బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ షద్మాన్‌ ఇస్లాం (46) టాప్‌ స్కోరర్‌ కాగా.. మొమినుల్‌ హక్‌ (21), ముష్ఫికర్‌ రహీం (35), లిటన్‌ దాస్‌ (34), మెహిది హసన్‌ మిరాజ్‌ (31), నయీమ్‌ హసన్‌ (25), తైజుల్‌ ఇస్లాం (33)  రెండంకెల స్కోర్లు చేశారు. అనాముల్‌ హక్‌ 0, కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో 8, ఎబాదత్‌ హొసేన్‌ 8 పరుగులకు ఔటయ్యారు.

బంగ్లా ఇన్నింగ్స్‌ను అశిత ఫెర్నాండో (18-2-51-3), విశ్వ ఫెర్నాండో (19-4-45-2), సోనల్‌ దినుష (9.3-3-22-3), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (17-1-72-1) దెబ్బకొట్టారు.

 నిస్సంక వరుస సెంచరీలు
శ్రీలంక బ్యాటింగ్‌ సంచలనం, ఆ జట్టు ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారీ శతకంతో (187) విరుచుకుపడిన అతను.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ అద్భుత శతకంతో (146 నాటౌట్‌) మెరిశాడు.

కాగా, రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. 

ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో రెండు ఇన్నింగ్స్‌ల్లో (148, 125 నాటౌట్‌) సెంచరీలు చేయగా.. ముష్ఫికర్‌ రహీం (163),పథుమ్‌ నిస్సంక (187) తమతమ తొలి ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశారు.

 

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)