Breaking News

శ్రీలంక‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌.. రెండో వ‌న్డేలో ఘ‌న విజ‌యం

Published on Sun, 07/06/2025 - 09:11

కొలంబో వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో 16 ప‌రుగుల తేడాతో బంగ్లాదేశ్ విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 1-1తో బంగ్లాదేశ్ స‌మం చేసింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ 45.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది.

పర్వేజ్‌ హుసేన్‌ (69 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), తౌహీద్‌ హృదయ్‌ (69 బంతుల్లో 51; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా...తన్జీమ్‌ హసన్‌ (21 బంతుల్లో 33 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 4, వనిందు హసరంగ 3 వికెట్లు పడగొట్టారు.

తిప్పేసిన తన్వీర్‌..
అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో శ్రీలంక  48.5 ఓవర్లలో 232 పరుగుల‌కు ఆలౌటైంది. బంగ్లా స్పిన్న‌ర్ త‌న్వీర్ ఇస్లాం  (5/39) ఐదు వికెట్లు ప‌డ‌గొట్టి లంకేయుల ప‌తనాన్ని శాసించాడు. అత‌డితో పాటు తన్జీమ్‌ హసన్ రెండు.. ష‌మీమ్‌, మెహ‌ది హ‌స‌న్, ముస్తఫిజుర్ రెహ్మ‌న్ త‌లా వికెట్ సాధించారు.

జనిత్‌ లియనాగే (85 బంతుల్లో 78; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్‌ మెండిస్‌ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 1 సిక్స్‌), కమిందు మెండిస్‌ (51 బంతుల్లో 33; 2 ఫోర్లు) రాణించినా...జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే మంగళవారం పల్లెకెలెలో జరుగుతుంది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)