Breaking News

BAN VS NZ 3rd ODI: బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ అరుదైన ఘనత

Published on Tue, 09/26/2023 - 16:37

బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ మహ్మదుల్లా అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో 21 పరుగులు చేసిన అతను.. తన వ్యక్తిగత స్కోర్‌ 1 వద్ద వన్డేల్లో 5000 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా వన్డేల్లో బంగ్లాదేశ్‌ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మహ్మదుల్లాకు ముందు తమీమ్‌ ఇక్బాల్‌ (243 మ్యా​చ్‌ల్లో 8357 పరుగులు), ముష్ఫికర్‌ రహీమ్‌ (256 మ్యాచ్‌ల్లో 7406), షకీబ్‌ అల్‌ హసన్‌ (240 మ్యాచ్‌ల్లో 7384 పరుగులు) వన్డేల్లో 5000 పరుగుల మార్కును అందుకున్నారు. 

కెరీర్‌లో మొత్తంగా 221 వన్డేలు ఆడిన మహ్మదుల్లా 3 సెంచరీలు, 27 హాఫ్‌ సెంచరీల సాయంతో 5020 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లో అతను 82 వికెట్లు పడగొట్టాడు.  

ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 26) జరుగుతున్న చివరి వన్డేలో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆ జట్టు 34.3 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్‌ పేసర్లు ట్రెంట్‌ బౌల్ట్‌ (2/33), ఆడమ్‌ మిల్నే (4/34), ఫెర్గూసన్‌ (1/26), రచిన్‌ రవీంద్ర (1/20), కోల్‌ మెక్‌కొంచి (2/18) బంగ్లాదేశ్‌ను దెబ్బతీశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో (76) ఒక్కడే రాణించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 86 పరుగుల తేడాతో గెలుపొందింది.

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)