Breaking News

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌కు షాక్‌.. ఏకంగా 3-4 నెలల పాటు..

Published on Thu, 09/14/2023 - 12:19

Huge Blow For Prithvi Shaw: టీమిండియా ఓపెనర్‌ పృథ్వీ షా అభిమానులకు చేదు వార్త! ఈ ముంబై బ్యాటర్‌ ఏకంగా మూడు నుంచి నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. కాగా ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌ గెలిచిన కెప్టెన్‌ పృథ్వీ షా.. 2018లో వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ(134)తో అదరగొట్టిన షా.. రెండేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ ఎంట్రీ ఇచ్చాడు.

ఇక్కడ కుదిరేలా లేదని.. అక్కడికెళ్లాడు
అయితే,  దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ.. రెండేళ్ల నుంచి పృథ్వీ షాకు జట్టులో చోటే కరువైంది. ఒకవేళ టీమిండియాకు సెలక్ట్‌ అయినా.. తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రావడం లేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో క్రికెట్‌ ఆడేందుకు నిర్ణయించుకున్న షా.. ఇంగ్లండ్‌ దేశవాళీ వన్డే కప్‌-2023లో అద్భుతాలు చేశాడు.

సెంచరీల మోత.. వెక్కిరించిన దురదృష్టం
ఆఖరిగా ఆడిన రెండు మ్యాచ్‌లలో డబుల్‌ సెంచరీ(244)తో పాటు అజేయ శతకం(125- నాటౌట్‌)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో గాయం రూపంలో షాను దురదృష్టం వెంటాడింది.

జాతీయ క్రికెట్‌ అకాడమీలో 
దీంతో భారత్‌కు తిరిగి వచ్చిన పృథ్వీ షా.. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీకి చేరుకున్నాడు. అయితే, మోకాలి గాయం తీవ్రతరమైనందున అతడు కనీసం మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

ఉబ్బిపోయిన మోకాలు
ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం.. ‘‘పృథ్వీ షా గాయపడిన తర్వాత ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేశారు. ఆ తర్వాత అతడు ఎన్సీఏకు వచ్చాడు. మోకాలు పూర్తిగా ఉబ్బిపోయింది. డాక్టర్‌ దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో షాకు చికిత్స అవసరమని భావించాం. 

గరిష్టంగా ఇంకో నాలుగు నెలల పాటు అతడు క్రికెట్‌ ఆడే పరిస్థితి లేదు’’ అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాతే 23 ఏళ్ల పృథ్వీ షా మోకాలికి సర్జరీ చేయాలా లేదా అన్న అంశంపై నిర్నయం తీసుకుంటామని తెలిపారు.

దేశవాళీ క్రికెట్‌కు దూరం
దీంతో.. వచ్చే నెలలో మొదలుకానున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ, నవంబరులో ఆరంభం కానున్న విజయ్‌ హజారే వన్డే టోర్నీ, జనవరిలో మొదలయ్యే రంజీ ట్రోఫీకి పృథ్వీ షా దూరం కానున్నాడు.

వాళ్ల నుంచి షాకు గట్టిపోటీ
కాగా ఇప్పటికే టీమిండియా ఓపెనర్‌గా పృథ్వీ షా ఒకప్పటి డిప్యూటీ శుబ్‌మన్‌ గిల్‌ స్థిరపడిపోగా.. ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైశ్వాల్‌ రూపంలో ఈ ముంబై బ్యాటర్‌కు గట్టిపోటీ ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్‌లో అదరగొట్టి.. దేశవాళీ క్రికెట్‌లో నిరూపించుకుని.. కమ్‌బ్యాక్‌ ఇవ్వాలని భావించిన పృథ్వీ షాను విధి ఇలా వెక్కిరించింది.

చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్‌ వర్సెస్‌ పాక్‌ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి..

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)