వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శతక్కొట్టిన పడిక్కల్‌

Published on Fri, 12/26/2025 - 16:46

లిస్ట్‌-ఏ క్రికెట్‌లో కర్ణాటక ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌ (Devdutt Padikkal) హవా కొనసాగుతోంది. 34 ఇన్నింగ్స్‌ల స్వల్ప కెరీర్‌లో 11వ శతకం (12 హాఫ్‌ సెంచరీలు కూడా ఉన్నాయి) నమోదు చేశాడు. విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో ఈ ఆర్సీబీ బ్యాటర్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. 

తొలి మ్యాచ్‌లో జార్ఖండ్‌పై వీరోచిత శతకం (118 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 147 పరుగులు) బాదిన పడిక్కల్‌.. తాజాగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ అదే తరహా ప్రదర్శన రిపీట్‌ చేశాడు. తన జట్టు 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో సెంచరీ పూర్తి చేసుకొని ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు (135 బంతుల్లో 123 నాటౌట్‌; 12 ఫోర్లు, 3 సిక్సర్లు). 

అతనికి జతగా మరో టీమిండియా ఆటగాడు కరుణ్‌ నాయర్‌ క్రీజ్‌లో ఉన్నాడు. కరుణ్‌ (98 బంతుల్లో 93 నాటౌట్‌; 10 ఫోర్లు) కూడా సెంచరీకి చేరువగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కర్ణాటక గెలవాలంటే 60 బంతుల్లో మరో 65 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. 40 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 220/1గా ఉంది. కర్ణాటక కోల్పోయిన ఒకే ఒక వికెట్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ది (1).

అంతకుముందు బాబా అపరాజిత్‌ (71), అజారుద్దీన్‌ (84 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించడంతో కేరళ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రోహన్‌ కున్నుమ్మల్‌ 12, అభిషేక్‌ నాయర్‌ 7, అహ్మద్‌ ఇమ్రాన్‌ డకౌట్‌, అకిల్‌ స్కారియా 27, విష్ణు వినోద్‌ 35, అంకిత్‌ శర్మ 2, నిధీశ్‌ 34 (నాటౌట్‌) పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో అభిలాశ్‌ షెట్టి 3 వికెట్లు పడగొట్టగా.. శ్రేయస్‌ గోపాల్‌ 2, విధ్వత్‌ కావేరప్ప, విద్యాదర్‌ పాటిల్‌ తలో వికెట్‌ తీశారు.

జార్ఖండ్‌పై వీరోచిత శతకం
పడిక్కల్‌ ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లో జార్ఖండ్‌పై వీరోచిత శతకం బాదాడు. 413 పరుగుల అతి భారీ లక్ష్య ఛేదనలో ఈ భారీ సెంచరీ చేసి తన జట్టు గెలుపుకు  గట్టి పునాది వేశాడు.

లిస్ట్‌-ఏ క్రికెట్‌ చరిత్రలో ఇది రెండో భారీ లక్ష్య ఛేదనగా.. విజయ్‌ హజారే టోర్నీ చరిత్రలో భారీ లక్ష్య ఛేదనగా రికార్డైంది. లిస్ట్‌-ఏ క్రికెట్‌ చరిత్రలో అతి భారీ లక్ష్య ఛేదన రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 435 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించింది.


 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)