Breaking News

ICC: అద్భుత ఇన్నింగ్స్‌.. ఐసీసీ అవార్డు అతడికే! వరల్డ్‌కప్‌లో..

Published on Tue, 09/12/2023 - 17:14

ICC Men's Player of the Month: పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి అవార్డు వరించింది. వన్డేల్లో నెంబర్‌.1 గా ఉన్న ఈ రికార్డుల వీరుడు ఆగష్టు నెలకుగానూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా ఎంపికయ్యాడు. తనతో పోటీ పడిన సహచర ఆటగాడు షాదాబ్‌ ఖాన్‌, వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్ నికోలస్‌ పూరన్‌లను వెనక్కి నెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు.

గత నెలలో నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లో రెండు అర్ధ శతకాలతో పాటు ఓ సెంచరీ నమోదు చేసిన బాబర్‌ ఆజంకు క్రికెట్‌ అభిమానులు పెద్దపీట వేశారు. కాగా శ్రీలంక వేదికగా అఫ్గనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విఫలమైన బాబర్‌.. తర్వాతి రెండు వన్డేల్లో వరుసగా ఫిఫ్టీలు సాధించాడు.

నేపాల్‌పై శతక్కొట్టిన బాబర్‌
తద్వారా.. పాకిస్తాన్‌ అఫ్గన్‌ జట్టును 3-0తో వైట్‌వాష్‌ చేయడంలో బాబర్‌ ఆజం కీలక పాత్ర పోషించాడు. ఇక ఆసియా కప్‌-2023లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌లో బాబర్‌ ఆజం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ వన్డే ఫార్మాట్‌ టోర్నీలో 131 బంతుల్లో ఏకంగా 151 పరుగులు సాధించాడు.

అరుదైన రికార్డు
తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీల మార్కు అందుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఆగష్టు నెలలో నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 264 పరుగులు రాబట్టిన బాబర్‌ ఈ మేరకు అవార్డు గెలుచుకున్నాడు. కాగా తన కెరీర్‌లో బాబర్‌ ఈ అవార్డు అందుకోవడం ఇది మూడోసారి.

వరల్డ్‌కప్‌లోనూ సత్తా చాటి
ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన బాబర్‌ ఆజం.. ఆసియా కప్‌- వన్డే వరల్డ్‌కప్‌-2023లో గెలుపొంది పాకిస్తాన్‌ అభిమానులకు మరింత వినోదం పంచుతామని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో బాబర్‌ ఆజం విఫలమైన విషయం తెలిసిందే. రిజర్వ్‌ డే అయిన సోమవారం నాటి కొలంబొ మ్యాచ్‌లో అతడు 10 పరుగులకే నిష్క్రమించాడు.

చదవండి: Asia Cup: షాహిద్‌ ఆఫ్రిది రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)