Breaking News

కోహ్లితో బాబ‌ర్‌కు పోలికా? అస‌లేం మాట్లాడుతున్నారు?

Published on Mon, 10/14/2024 - 11:47

పాకిస్తాన్ స్టార్ ప్లేయ‌ర్ బాబ‌ర్ ఆజం గ‌త కొంత కాలంగా గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఫామ్ కోల్పోయి నానా తంటాలు ప‌డుతున్నాడు. స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో విఫ‌ల‌మైన బాబ‌ర్‌.. ఇప్పుడు ఇంగ్లండ్‌పై అదే తీరును క‌న‌బరుస్తున్నాడు. ముల్తాన్ వేదికగా జ‌రిగిన మొద‌టి టెస్టులో కేవ‌లం 35 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచాడు.

ఈ క్ర‌మంలో పీసీబీ కొత్త సెల‌క్ష‌న్ క‌మిటీ బాబ‌ర్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టుల‌కు జ‌ట్టు నుంచి ఆజంను సెల‌క్ట‌ర్లు త‌ప్పించారు. దీంతో పీసీబీ తీరుపై పలువరు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. అత్యుత్తమ ఆటగాడిని జట్టు నుంచి ఎలా తప్పిస్తారని సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

మరికొంతమంది అయితే ఆజంను విరాట్ కోహ్లితో పోలుస్తున్నారు. కోహ్లి ఫామ్ కోల్పోయినప్పుడు బీసీసీఐ అండగా ఉందని, పీసీబీ మాత్రం అలా చేయలేదని పాక్ స్టార్ క్రికెటర్ ఫఖార్ జమాన్ సైతం విమర్శలు గుప్పించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఆజంను విరాట్ కోహ్లితో పోల్చవద్దని హాగ్ అన్నాడు.

"ఇంగ్లండ్‌తో ఆఖరి రెండు టెస్టులకు పాక్ జట్టులో స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం చోటు కోల్పోయాడు. గత కొన్ని రోజులగా అందరూ ఊహించిందే జరిగింది. అయితే  చాలా మంది బాబర్ ఆజం ఫామ్‌ను విరాట్ కోహ్లితో పోలుస్తున్నారు. దయచేసి ఆజంను కోహ్లితో పోల్చవద్దు.

కోహ్లి ఫామ్ కోల్పోయినప్పుడు భారత్ ప్రపంచంలోనే రెండవ అత్యుత్తమ జట్టుగా ఉంది. మరి బాబర్ ఫామ్ కోల్పోయినప్పుడు పాకిస్తాన్ ప్రపంచంలోనే రెండువ అత్యంత చెత్త జట్టుగా ఉంది. కొన్ని సార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు" అని హాగ్‌ ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా బాబర్ గత 18 టెస్టు ఇన్నింగ్స్‌లో కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోయాడు.
చదవండి: ‘అతడినే తప్పిస్తారా?.. ఇంతకంటే పిచ్చి నిర్ణయం మరొకటి ఉండదు’

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)