Breaking News

స్పిన్న‌ర్‌గా మారిన బాబ‌ర్ ఆజం.. సూప‌ర్ డెలివ‌రీతో క్లీన్ బౌల్డ్‌! వీడియో

Published on Sun, 08/31/2025 - 13:30

ఆసియా కప్-2025కు పాకిస్తాన్ జ‌ట్టులో స్టార్ బ్యాట‌ర్ బాబర్ ఆజం చోటు ద‌క్కించుకోలేక‌పోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఖాళీగా ఉంటున్న బాబ‌ర్ ఆజం.. తాజా ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో అభిమానుల‌ను అల‌రించాడు. శ‌నివారం వ‌రద బాధితులకు విరాళాలు సేక‌రించేందుకు పెషావర్ జల్మి, ఆల్-స్టార్ లెజెండ్స్ ఎలెవ‌న్ జట్ల మ‌ధ్య  ఎగ్జిబిషన్ మ్యాచ్ జ‌రిగింది.

ఈ మ్యాచ్‌లో పెషావర్ జల్మికి ప్రాతినిథ్యం వ‌హించిన బాబ‌ర్‌.. స్పిన్న‌ర్‌గా స‌రికొత్త అవతారమెత్తాడు. స్పిన్ బౌలింగ్ చేయ‌డ‌మే కాకుండా రెండు వికెట్లు ప‌డ‌గొట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. పాకిస్తాన్ దిగ్గ‌జ బ్యాట‌ర్ యూనిస్ ఖాన్‌ను బాబ‌ర్ అద్బుత‌మైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. 

మ‌రొక పాక్ మాజీ టెస్టు బ్యాట‌ర్ అజార్ అలీని కూడా బాబ‌ర్ పెవిలియ‌న్‌కు పంపాడు. అంత‌కుముందు బ్యాటింగ్‌లో కూడా బాబ‌ర్ దుమ్ములేపాడు. కేవ‌లం 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 41 ప‌రుగులు చేశాడు. అత‌డి బౌలింగ్‌, బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వ‌తున్నాయి.

కాగా బాబ‌ర్ ఆజం పేరిట 7 ఫ‌స్ట్ క్లాస్ వికెట్లు, 12 లిస్ట్‌-ఎ వికెట్లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్-స్టార్ లెజెండ్స్‌పై 6 ప‌రుగుల తేడాతో పెషావర్ జల్మి విజ‌యం సాధించింది. పెషావర్ నిర్ధేశించిన 145 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆల్-స్టార్ లెజెండ్స్ టీమ్ ఛేదించ‌లేక‌పోయింది. ఆల్-స్టార్ లెజెండ్స్  కెప్టెన్ ఇంజామామ్ ఉల్ హక్(46) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.


 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)