Breaking News

బాబర్‌ అజమ్‌ నెంబర్‌వన్‌.. టీమిండియా నుంచి ఒక్కరు లేరు

Published on Wed, 11/17/2021 - 15:36

No Indian Batter Ranks In Top Five ICC Batting Rankings.. టి20 ప్రపంచకప్‌ 2021 ముగిసిన అనంతరం ఐసీసీ బుధవారం టి20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. బ్యాటింగ్‌ విభాగంలో టాప్‌-5లో ఒక్క టీమిండియా బ్యాటర్‌ కూడా లేడు. ఇక బౌలింగ్‌, ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌ విభాగంలో ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం ఆశ్చర్యపరిచింది.

చదవండి: Ind Vs Nz 2021: ‘బ్యాటర్‌’గా విరాట్‌ కోహ్లి... టీ20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏమన్నాడంటే!

బ్యాటింగ్‌ విభాగంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ 839 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి దుమ్మురేపాడు. ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్‌ మలాన్‌ 805 పాయింట్లతో రెండో స్థానంలో.. ఎయిడెన్‌ మార్క్రమ్‌ 796 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డెవన్‌ కాన్వే 747 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు. టి20 ప్రపంచకప్‌లో సూపర్‌ ప్రదర్శన కనబరిచిన పాక్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఒక స్థానం మెరుగుపరుచుకొని 742 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. టీమిండియా తరపున టి20 ప్రపంచకప్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన కేఎల్‌ రాహుల్‌ ఒకస్థానం దిగజారి ఆరో స్థానంలో ఉన్నాడు.

ఇక బౌలింగ్‌ విభాగానికి వస్తే.. టి20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌తో మెరిసిన వనిందు హసరంగ 797 పాయింట్లతో టాప్‌ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్‌ తబ్రెయిజ్‌ షంసీ 784 పాయింట్లతో రెండో స్థానంలో.. ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా రెండు స్థానాలు ఎగబాకి 725 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండ్‌ విభాగంలో మహ్మద్‌ నబీ 265 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. షకీబ్‌ అల్‌ హసన్‌ (260 పాయింట్లు), లియామ్‌ లివింగ్‌స్టోన్‌(179 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)