Breaking News

బాబర్‌ ఆజం కూడా ఊహించలేదు..

Published on Sun, 09/11/2022 - 22:18

ఆసియా కప్‌ టోర్నీలో పాకిస్తాన్‌, శ్రీలంకల మధ్య ఫైనల్‌ పోరు ఆసక్తికరంగా జరుగుతుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక బానుక రాజపక్స మెరుపులతో 170 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు మరోసారి బాబర్‌ ఆజం రూపంలో షాక్‌ తగిలింది. 5 పరుగులు చేసిన బాబర్‌ ఆజం ప్రమోద్‌ మధుషాన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు.

అయితే బాబర్‌ ఔటైన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మాములుగా ఒక బ్యాటర్‌ ఫైన్‌లెగ్‌ దిశగా బంతిని బాదితే కచ్చితంగా బౌండరీ లేదా పరుగులు వస్తాయి. కానీ ఇక్కడే లంక కెప్టెన్‌ దాసున్‌ షనక తెలివిని ఉపయోగించాడు. బాబర్‌ ఆజం ఫైన్‌లెగ్‌ దిశగా ఆడేలా బంతిని వేయమని షనక చెప్పడం.. ప్రమోద్‌ అదే తరహాలో బంతి వేయడం.. ఫైన్‌ లెగ్‌ దిశలో ఉన్న మధుషనక క్యాచ్‌ తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. 

బాబర్‌ ఆజం తాను ఇలా ఔట్‌ అవుతానని ఊహించలేదనుకుంటా.. కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. ఇక బాబర్‌ తన ఫేలవ ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. ఆసియా కప్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లాడిన బాబర్‌ కేవలం 68 పరుగులు మాత్రమే చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 10, 9, 14, 0, 30, 5 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక గోల్డెన్‌ డక్‌ కూడా ఉండడం విశేషం. అలా ఈ పాక్‌ కెప్టెన్‌ తన ఫేలవ ఆటతీరుతో ఆసియా కప్‌ను ముగించాల్సి వచ్చింది.

చదవండి: Kushal Mendis: అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక బ్యాటర్‌ అత్యంత చెత్త రికార్డు

Asia Cup 2022 Final: పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన రాజపక్స..

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)