Breaking News

'బాబర్‌ చాలా సింపుల్‌గా ఉంటాడు.. కానీ బ్యాటింగ్‌ మాత్రం అద్భుతం'

Published on Thu, 08/31/2023 - 09:40

ఆసియాకప్‌-2023లో తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్ ఆజం విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ముల్తాన్‌ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌ల ఆజం అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న బాబర్‌.. 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 151 పరుగులు చేశాడు. 

పాకిస్తాన్‌ 342 పరుగుల భారీ స్కోర్‌ సాధించడంలో బాబర్‌ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్లు ఫఖర్‌ జమాన్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌ త్వరగా ఔటైనప్పటికీ బాబర్‌.. ఇఫ్తికర్‌ అహ్మద్‌తో కలిసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో నేపాల్‌ను పాక్‌ చిత్తు చేసింది.

బాబర్‌పై ప్రశంసల జల్లు..
ఇక అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన బాబర్‌ ఆజంపై భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తా ప్రశంసల వర్షం కురిపించాడు. దీప్‌ దాస్‌గుప్తా ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో దీప్‌దాస్‌ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. "బాబర్‌ చూడడానికి చాలా సింపుల్‌గా ఉంటాడు. కానీ అతడు బ్యాటింగ్‌ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అతడొక కవి లాంటి వాడు. కవి ఎలా అయితే తన రిథమ్‌ను కొనసాగిస్తాడో ఆజం కూడా అంతే.

అతడు నేపాల్‌  వంటి చిన్న జట్టుపై సెంచరీ చేశాడని మనం తక్కువగా చూడకూడదు. ఎందుకంటే వారు కూడా 40వ ఓవర్‌ వరకు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ముల్తాన్‌ వికెట్‌ కూడా అంత ఈజీగా లేదు. వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది. ఇటువంటి పరిస్ధితుల్లో బాబర్‌ చాలా కష్టపడ్డాడు. అతడు తీవ్రంగా శ్రమించి సెంచరీ సాధించాడు. బాబర్ ఏజట్టుతో అయినా ఒకే విధంగా ఆడుతాడు. అతడికి పరుగులు చేయాలనే ఆకలి ఎక్కువ అని దీప్‌దాస్‌ గుప్తా పాక్‌-నేపాల్‌ మ్యాచ్‌ సందర్భంగా పేర్కొన్నాడు.
చదవండి: Asia Cup 2023: టీమిండియాతో మ్యాచ్‌.. పాకిస్తాన్‌కు బిగ్‌షాక్‌! ఇక అంతే సంగతి

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)