Breaking News

PAK VS NZ 2nd T20: చరిత్ర సృష్టించిన బాబర్‌ ఆజమ్‌.. ధోని, రోహిత్‌ రికార్డులు బద్దలు

Published on Sun, 04/16/2023 - 11:38

పాకిస్తాన్‌ సారధి బాబర్‌ ఆజమ్‌ టీ20ల్లో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. లాహోర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా టీ20ల్లో అత్యధిక విజయాలు (42) సాధించిన కెప్టెన్‌గా ఇంగ్లండ్‌ మాజీ సారధి ఇయాన్‌ మోర్గాన్‌ (42), ఆఫ్ఘనిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ అస్గర్‌ స్టానిక్‌జాయ్‌ (42) సరసన నిలిచాడు. ఈ క్రమంలో అతను టీమిండియా కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రికార్డును(41) అధిగమించాడు. తన కెరీర్‌లో మొత్తంగా 101 టీ20లు ఆడిన బాబర్‌ కెప్టెన్‌గా 68 మ్యాచ్‌ల్లో 42 విజయాలు సాధించాడు.

ఇదే మ్యాచ్‌లో బాబర్‌ ఈ రికార్డుతో పాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో శతక్కొట్టిన బాబర్‌ (58 బంతుల్లో 101; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్‌గా మూడు సెంచరీలు సాధించి, టీ20ల్లో అత్యధిక సార్లు ఈ మార్కును అందుకున్న కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో బాబర్‌ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (2), స్విట్జర్లాండ్‌ సారధి ఫహీమ్‌ నజీర్‌ (2) ఉన్నారు.  

ఇక ఇదే మ్యాచ్‌లో పాక్‌ ఓపెనింగ్‌ జోడీ బాబర్‌-మహ్మద్‌ రిజ్వాన్‌ సంయుక్తంగా ఓ రికార్డును నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించిన బాబర్‌-రిజ్వాన్‌ జోడీ టీ20ల్లో 19వ సారి 50 ప్లస్‌ పార్ట్‌నర్‌షిప్‌ నమోదు చేసిన జోడీగా రికార్డుల్లోకెక్కింది. టీ20ల్లో ఏ ఇతర జోడీ కూడా ఇన్ని సార్లు ఈ ఘనత సాధించలేదు. టీమిండియా ఓపెనింగ్‌ పెయిర్‌ రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ టీ20ల్లో 15 సార్లు 50 ప్లస్‌ భాగస్వామ్యాలు నమోదు చేశారు. 

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో బాబర్‌ (101 నాటౌట్‌), రిజ్వాన్‌ (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, సిక్స్‌) చెలరేగడంతో పాకిస్తాన్‌ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. త​ద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి టీ20లో 4 వికెట్లతో న్యూజిలాండ్‌ వెన్ను విరిచిన హరీస్‌ రౌఫ్‌ ఈ మ్యాచ్‌లోనూ 4 వికెట్లతో చెలరేగాడు.   

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)