Breaking News

ఎట్టకేలకు శతక్కొట్టిన బాబర్‌ ఆజమ్‌

Published on Mon, 04/20/2026 - 10:56

పొట్టి క్రికెట్‌లో పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ ఎట్టకేలకు సెంచరీ చేశాడు. ఈ ఫార్మాట్‌లో 67 ఇన్నింగ్స్‌ల్లో అతనికిది మొదటి శతకం. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 19) క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్‌ శతక్కొట్టాడు. 

ఈ సెంచరీ అతనికి టీ20 ఫార్మాట్‌లో 12వది. ఈ సెంచరీతో బాబర్‌ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో తన రెండో స్థానాన్ని మరింత మెరుగుపర్చుకున్నాడు. 

ఈ జాబితాలో విండీస్‌ యోధుడు క్రిస్‌ గేల్‌ (22) టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. బాబర్‌ తర్వాత మూడో స్థానంలో డేవిడ్‌ వార్నర్‌ (10) ఉన్నాడు. వీరి తర్వాత సాహిబ్‌జాదా ఫర్హాన్‌, రిలీ రొస్సో, విరాట్‌ కోహ్లి, క్వింటన్‌ డికాక్‌ తలో 9 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నారు.

బాబర్‌ తాజా సెంచరీ విషయానికొస్తే.. ఈ సెంచరీని అతను కేవలం 52 బంతుల్లో పూర్తి చేశాడు. ఈ సెంచరీ కూడా బాబర్‌కు అత్యంత నాటకీయ పరిస్థితుల్లో వచ్చింది. ఇన్నింగ్స్‌ చివరి బంతి మిగిలుండగా బాబర్‌ మూడంకెల మార్కును అందుకునేందుకు 2 పరుగులు కావాలి​. 

అయితే ఆ బంతికి బాబర్‌ ఆడిన షాట్‌కు ఒక్క పరుగు మాత్రమే వచ్చేలా కనిపించింది. అయినప్పటికీ బాబర్‌ సాహసం చేసి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీ తర్వాత బాబర్‌ గర్జిస్తూ సంబురాలు చేసుకున్నాడు. చాలాకాలం తర్వాత వచ్చిన సెంచరీ కావడంతో బాబర్‌ ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి.

ప్రస్తుత పాక్‌ సూపర్‌ లీగ్‌లో బాబర్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సెంచరీకి ముందు 2 భారీ అర్ద సెంచరీలు చేశాడు. ఈ సీజన్‌లో బాబర్‌ సగటు 100కుపైగా ఉంది. స్ట్రయిక్‌రేట్‌ 143.73గా ఉంది. పీఎస్‌ఎల్‌కు ముందు బాబర్‌ టీ20 భవితవ్యంపై అనేక అనుమానాలు ఉండేవి. అతను టీ20ల నుంచి తప్పుకోవాలని డిమాండ్లు వినిపించాయి. అయితే తాజాగా ప్రదర్శనతో అతను అందరి నోళ్లు మూయించాడు.

బాబర్‌ తాజా సెంచరీ కారణంగా అతని జట్టు పెషావర్‌ జల్మీ క్వెట్టా గ్లాడియేటర్స్‌పై 118 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. బాబర్‌తో పాటు కుసాల్‌ మెండిస్‌ (83) రాణించాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గ్లాడియేటర్స్‌ చేతులెత్తేసింది. 18.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. అలీ రజా, బాసిత్‌ తలో 3, హార్డీ 2, బ్రేస్‌వెల్‌, ముఖీమ్‌ చెరో వికెట్‌ తీసి గ్లాడియేటర్స్‌ను కుప్పకూల్చారు.

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)