Breaking News

చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Published on Mon, 04/20/2026 - 16:07

పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌-2026లో పెషావర్ జల్మీ కెప్టెన్‌, స్టార్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజం త‌న సూప‌ర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం క‌రాచీ స్టేడియం వేదిక‌గా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ అద్భుతమైన సెంచరీతో చెల‌రేగాడు. ఈ మ్యాచ్‌లో బాబ‌ర్ త‌న శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు.

గ్లాడియేట‌ర్స్ బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. కేవలం 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో బాబర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా బాబర్ ఆజం రికార్డులకెక్కాడు.

బాబర్ కేవలం 338 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్(344) పేరిట ఉండేది. గేల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి (360 ఇన్నింగ్స్‌లు) ఉండేవాడు. తాజాగా ఇన్నింగ్స్‌తో వీరిద్దరిని బాబర్ అధిగమించాడు. కాగా బాబర్‌కు ఇది 12వ సెంచ‌రీ.

టీ20ల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన జాబితాలో బాబ‌ర్ రెండో స్ధానంలో ఉన్నాడు. మొద‌టి స్ధానంలో క్రిస్ గేల్ (22 సెంచరీలు) కొన‌సాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో బాబ‌ర్ మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఒక ఇన్నింగ్స్ 50 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొని కేవ‌లం ఒకే ఒక్క డాట్ బాల్ ఆడిన మొద‌టి ఆట‌గాడిగా బాబ‌ర్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బాబర్ ఎదుర్కొన్న 52 బంతుల్లో ఒకే డాట్ బాల్ ఉంది.
చదవండి: BCCI: వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్‌ ప్ర‌మోష‌న్‌!
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)