చరిత్ర సృష్టించిన బాబర్‌ ఆజం.. ప్రపంచంలో ఒకే ఒక్కడు

Published on Tue, 03/19/2024 - 12:30

రెండు నెలల పాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2024 సీజన్‌కు ఎండ్‌ కార్డ్‌ పడింది. ఈ ఏడాది పీఎస్‌ఎల్‌ ఛాంపియన్స్‌గా ఇస్లామాబాద్‌ యునైటడ్‌ నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో ముల్తాన్‌ సూల్తాన్స్‌ను 2 వికెట్ల తేడాతో ఓడించిన ఇస్లామాబాద్‌.. మూడో సారి ఛాంపియన్స్‌గా అవతరించింది.

ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది సీజన్‌లో పెషెవర్‌ జెల్మీ టైటిల్‌ సాధించకపోయినప్పటికి ఆ జట్టు కెప్టెన్‌, పాకిస్తాన్‌ స్టార్‌ బాబర్‌ ఆజం మాత్రం అరుదైన ఘనతను సాధించాడు.

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మూడు సార్లు హనీఫ్ మొహమ్మద్ క్యాప్‌ సొంతం చేసుకున్న మొదటి క్రికెటర్‌గా బాబర్‌ రికార్డులకెక్కాడు. పీఎస్‌ఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి హనీఫ్ మొహమ్మద్ క్యాప్‌(గ్రీన్‌ ​క్యాప్‌)ను అందిస్తారు.

ఇప్పుడు వరకు మూడు పీఎస్‌ఎల్‌ సీజన్లలో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా బాబర్‌ నిలిచాడు. 2020 సీజన్‌లో 473 పరుగులతో లీడింగ్‌ రన్ స్కోరర్‌గా నిలిచిన బాబర్‌.. ఆ తర్వాత 2021 సీజన్‌లోనూ 554 పరుగులతో గ్రీన్‌ క్యాప్‌ను తన వద్దే ఉంచుకున్నాడు. ఇప్పుడు పీఎస్‌ఎల్‌-2024లోనూ 569 పరుగులతో టాప్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. 11 మ్యాచ్‌ల్లో 569 పరుగులు చేశాడు. అందులో 5 ఫిప్టీలతో పాటు ఓ సెంచరీ కూడా ఉంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)