Breaking News

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌కు అత్యున్నత పురస్కారం

Published on Thu, 03/23/2023 - 15:55

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌కు అతని దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం లభించింది. పాకిస్తాన్‌ క్రికెట్‌కు బాబర్‌ చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆ దేశ ప్రభుత్వం అతన్ని సితార-ఎ-ఇమ్తియాజ్‌ అవార్డుతో సత్కరించింది. గతంలో పాక్‌ క్రికెటర్లు మిస్బా-ఉల్-హక్, యూనిస్ ఖాన్, షాహిద్ అఫ్రిదిలకు మాత్రమే సితార-ఎ-ఇమ్తియాజ్‌ పురస్కారం లభించింది.

ఈ అవార్డు అందుకున్న అత్యంత పిన్న వయస్కుడు బాబర్‌ ఆజమే (28) కావడం​ విశేషం. ఈ రోజు (మార్చి 23) లాహోర్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బాబర్‌ ఈ అవార్డు అందుకున్నాడు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఆఫ్ఘనిస్తాన్‌తో రేపటి నుంచి ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు బాబర్‌.   

కాగా, అసాధారణ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన బాబర్‌.. పాక్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక ఆ దేశ క్రికెటింగ్‌ విధానాల్లో అనేక మార్పులు వచ్చాయి. బాబర్‌ సొంతంగా రాణిస్తూ, జట్టు సభ్యులందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈ క్రమంలో అతను అనేక అవార్డులు, రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 2022 ఐసీసీ మెన్స్‌ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌, 2022 ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, 2022 ఐసీసీ కెప్టెన్‌ ఆఫ్ ది ఇయర్ (వన్డే టీమ్‌) వంటి ప్రతిష్టాత్మక అవార్డులు ఉన్నాయి. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)