Breaking News

చరిత్రకెక్కిన బాబర్‌ ఆజం.. తొలి పాకిస్తాన్‌ క్రికెటర్‌గా! మాలిక్‌ రికార్డు బ్రేక్‌

Published on Fri, 11/15/2024 - 13:00

పాకిస్తాన్ స్టార్ ప్లేయ‌ర్ బాబ‌ర్ ఆజం ఓ అరుదైన ఘ‌న‌తను త‌న పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్ త‌ర‌పున అత్యధిక అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా బాబ‌ర్ రికార్డుల‌కెక్కాడు. గురువారం బ్రిస్బేన్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టీ20 బాబ‌ర్‌కు 124వ అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్. త‌ద్వారా ఈ అరుదైన ఫీట్‌ను బాబ‌ర్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ఇంత‌కుముందు ఈ రికార్డు పాక్ వెట‌ర‌న్ ఆల్‌రౌండ‌ర్ షోయబ్‌ మాలిక్‌(123) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మాలిక్ రికార్డును ఆజం బ‌ద్ద‌లు కొట్టాడు. ఇప్పటివరకు 124 టీ20లు ఆడిన బాబర్‌.. 40.67 సగటుతో 4148 పరుగులు చేశాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. పాకిస్తాన్‌పై  29 పరుగుల తేడాతో ఆసీస్ విజ‌యం సాధించింది.  వెలుతురు లేమి కారణంగా నిర్ణీత‌ సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన తొలి టి20ని చివరకు 7 ఓవర్లకు కుదించారు. మొద‌ట బ్యాటింగ్ చేసిన  ఆస్ట్రేలియా 7 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. 

ఆసీస్ బ్యాట‌ర్ల‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌19 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టొయినిస్‌ (7 బంతుల్లో 21 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.  పాకిస్తాన్‌ బౌలర్లలో అబ్బాస్‌ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్‌ 7 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 64 పరుగులకు పరిమితమైంది. పాక్‌ బ్యాటర్లలో అబ్బాస్‌ అఫ్రిది (20 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 సిడ్నీ వేదికగా శనివారం జరగనుంది.  

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)