Breaking News

బాబర్‌ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

Published on Mon, 05/13/2024 - 19:23

ఐర్లాండ్‌తో తొలి టీ20లో ఓట‌మికి పాకిస్తాన్ బ‌ద‌లు తీర్చుకుంది. డ‌బ్లిన్ వేదిక‌గా ఐర్లాండ్‌తో జ‌రిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘ‌న విజ‌యం సాధించింది. 194 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పాకిస్తాన్ కేవ‌లం 3 వికెట్లు మాత్ర‌మే 16.5 ఓవ‌ర్ల‌లో చేధించింది.

పాక్ బ్యాట‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌(75), ఫ‌ఖార్ జ‌మాన్‌(78) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 193 ప‌రుగులు చేసింది.

ఐరీష్ బ్యాట‌ర్ల‌లో లారెన్ ట‌క్క‌ర్‌(51), టాక్టెర్‌(32) ప‌రుగుల‌తో రాణించాడు. పాక్ బౌల‌ర్ల‌లో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అమీర్‌, న‌సీం షా త‌లా వికెట్ సాధించారు.

బాబ‌ర్ ఆజం వ‌ర‌ల్డ్ రికార్డు..
ఇక మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజం అరుదైన ఘ‌న‌త  సాధించాడు. టీ20ల్లో అత్య‌ధిక మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించిన కెప్టెన్‌గా బాబ‌ర్ రికార్డుల‌కెక్కాడు. 

బాబ‌ర్ సార‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు పాకిస్తాన్ 45 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. ఇంత‌కుముందు ఈ రికార్డు ఉగాండా కెప్టెన్ బ్రియాన్ మసాబా పేరిట ఉండేది. బ్రియాన్ మసాబా కెప్టెన్‌గా ఉగాండాకు 44 టీ20లు విజ‌యాలు అందించాడు.

 తాజా విజ‌యంతో మ‌సాబా రికార్డును బాబ‌ర్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో వీరిద్ద‌రి త‌ర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (42), మోర్గాన్ (42), ఆఫ్ఘనిస్థాన్ మాజీ సార‌థి అస్గర్ ఆఫ్ఘన్ (42), భార‌త మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ (41), రోహిత్ శర్మ (41) ఉన్నారు.
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి