Breaking News

చాలా బాధగా ఉంది.. అదే మా కొంపముంచింది! క్రెడిట్‌ మాత్రం వారికే: బాబర్‌ ఆజం

Published on Tue, 10/24/2023 - 10:42

వన్డే ప్రపంచకప్‌-2023లో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ ఓటమి పాలైంది. 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆఫ్గానిస్తాన్‌ విజయం సాధించింది. అంతర్జాతీయ వన్డేల్లో పాక్‌పై ఆఫ్గాన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.

ఆఫ్గాన్‌ విజయంలో గుర్బాజ్‌(65), ఇబ్రహీం జద్రాన్‌(87), రెహమత్‌ షా(77) పరుగులతో కీలక పాత్ర పోషించారు. కాగా ఈ మెగా టోర్నీలో పాక్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమానార్హం​. ఇక ఆఫ్గాన్‌పై ఓటమిపై మ్యాచ్‌ అనంతరం పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం స్పందించాడు. తమ ఓటమికి కారణం బౌలర్ల వైఫల్యమనేని బాబర్‌ అన్నాడు.

"ఈ మ్యాచ్‌లో ఓటమి మాకు చాలా బాధ కలిగించింది. ముందు బ్యాటింగ్‌లో మంచి టార్గెట్‌ను సెట్‌ చేశాము. కానీ మా బౌలర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా  మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయారు. మా స్పిన్నర్లు కూడా పెద్దగా ప్రభావితం చేయలేదు. బ్యాటర్లపై ఏమాత్రం ఒత్తిడి తీసుకుని రాలేకపోయారు.

ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలో ఏ ఒక్క విభాగంలో రాణించకపోయినా మ్యాచ్‌ ఓడిపోతాం. అది బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ అయినా కావచ్చు. ఈ రోజు ఫీల్డింగ్‌లో కూడా మేము మెరుగ్గా రాణించలేకపోయాం. మేము బౌండరీలు ఆపలేదు, అదనపు పరుగులు కూడా సమర్పించుకున్నాం.

అదే మా కొంపముంచింది. కానీ ఆఫ్గానిస్తాన్‌ మాత్రం అద్భుతమైన క్రికెట్‌ ఆడింది. కాబట్టి క్రెడిట్‌ వారికే ఇవ్వాలనకుంటున్నాను. వారు మూడు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించారు. అందుకే విజయం సాధించారు. మా తదుపరి మ్యాచ్‌ల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తామని పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో బాబర్‌ పేర్కొన్నాడు.
చదవండి: ODI WC 2023 PAK Vs AFG: పాకిస్తాన్ పై అఫ్గాన్ సంచలన విజయం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)