Breaking News

టీ20 వరల్డ్‌కప్‌లో చెత్త రికార్డు.. ఒకే ఓవర్‌లో 36 పరుగులు! వీడియో

Published on Tue, 06/18/2024 - 11:03

అఫ్గానిస్తాన్ స్టార్‌ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా  ఒమర్జాయ్ రికార్డులకెక్కాడు.

టీ20 వరల్డ్‌కప్‌-2024లో సెయింట్‌ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 36 పరుగులిచ్చిన ఒమర్జాయ్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసున్నాడు. ఈ మ్యాచ్‌లో విండీస్‌ ఇన్నింగ్స్ 4వ ఓవర్‌ వేసిన ఒమర్జాయ్‌కు నికోలస్‌ పూరన్‌ చుక్కలు చూపించాడు. 

ఆ ఓవర్‌లో పూరన్‌ 3 సిక్స్‌లు, రెండు ఫోర్లతో 26 పరుగులు రాబట్టగా.. ఒమర్జాయ్‌ ఎక్స్‌ట్రాస్‌( వైడ్‌+4, నో బాల్‌, 4 లెగ్‌ బైస్‌)రూపంలో 10 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా ఆ ఓవర్‌లో 36 పరుగులు వచ్చాయి.

ఇక ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఇంగ్లండ్‌ లెజెండరీ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో బ్రాడ్‌ బౌలింగ్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ వరుసగా 6 సిక్స్‌లు బాది 36 పరుగులు రాబాట్టాడు.

మళ్లీ  17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్‌లో 36 పరుగులు వచ్చాయి. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. అఫ్గాన్‌పై 104 పరుగుల తేడాతో విండీస్‌ ఘన విజయం సాధించింది. అయితే ఇరు జట్లు ఇప్పటికే సూపర్‌-8కు అర్హత సాధించాయి.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)