Breaking News

సీఎస్‌కేకు కోలుకోలేని దెబ్బ

Published on Sun, 04/19/2026 - 12:14

ఐపీఎల్‌ 2026లో సీఎస్‌కేకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నిన్న (ఏప్రిల్‌ 18) ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన (hamstring tear) యువ బ్యాటర్‌ ఆయుశ్‌ మాత్రే సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడని తెలుస్తుంది. మాత్రే గాయంపై ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ అధికారక ప్రకటన చేశాడు. మాత్రే గాయం చాలా తీవ్రమైందని ఆయన ధృవీకరించాడు. హస్సీ ప్రకటనతో మాత్రే సీజన్‌ మొత్తానికి దూరమవుతున్న విషయం స్పష్టమవుతుంది.

ఈ సీజన్‌లో మాత్రే అద్భుతమైన టచ్‌లో ఉన్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో తనవంతు కర్తవ్యాన్ని సమర్దవంతంగా నిర్వర్తించాడు. సీఎస్‌కే సాధించిన రెండు విజయాల్లోనూ తనదైన పాత్ర పోషించాడు. ఇలాంటి సమయంలో అతను జట్టుకు దూరం కావడం సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బే అవుతుంది. ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లోనే మాత్రే చాలా ఇబ్బందిపడుతూ బ్యాటింగ్‌ చేశాడు.

మాత్రే గాయం తీవ్రత స్కానింగ్స్‌లో తెలుస్తుంది. ఈ సీజన్‌లో మాత్రే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 178 స్ట్రయిక్‌రేట్‌తో 201 పరుగులు చేసింది. ఇందులో 2 అర్ద సెంచరీలు, రెండు 30 ప్లస్‌ స్కోర్లు ఉన్నాయి. 

తదుపరి మ్యాచ్‌ల్లో మాత్రే స్థానాన్ని ఉర్విల్‌ పటేల్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది. మాత్రే గాయం సీఎస్‌కే గాయాల జాబితాను మరింత పెద్దది చేసింది. ఇప్పటికే ధోని, ఖలీల్‌ అహ్మద్‌, నాథన్‌ ఎలిస్‌, స్పెన్సర్‌ జాన్సన్‌ ఈ జాబితాలో ఉన్నారు.

నిన్నటి ఎస్‌ఆర్‌హెచ్‌-సీఎస్‌కే మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. హ్యాట్రిక్‌ పరాజయాలు, రెండు వరుస విజయాల తర్వాత సీఎస్‌కేకు ఎదురైన మరో పరాజయం ఇది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే గెలవాల్సింది. 

అయితే ఆ జట్టు చేజేతులా ఈ అవకాశాన్ని జారవిడ్చుకుంది. తొలుత బౌలింగ్‌లో సన్‌రైజర్స్‌ను భారీ స్కోర్‌ చేయకుండా కట్టడి చేసిన సీఎస్‌కే బౌలర్లు.. ఆతర్వాత ఛేదనలో సగం​ వరకు మ్యాచ్‌పై పట్టు నిలుపుకున్నారు. అయితే అనూహ్యంగా సన్‌రైజర్స్‌ బౌలర్లు మ్యాచ్‌పై పట్టుబిగించి సీఎస్‌కే గెలుపును అడ్డుకున్నారు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (59), క్లాసెన్‌ (59) అర్ద సెంచరీలతో రాణించారు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్‌ కంబోజ్‌ (3-0-22-3), జేమీ ఓవర్టన్‌ (4-0-37-3), ముకేశ్‌ చౌదరి (2-0-21-2), గుర్జప్నీత్‌ సింగ్‌ (4-0-34-1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

అనంతరం బరిలోకి దిగిన సీఎస్‌కే ఓ దశ వరకు సునాయాసంగా గెలిచేలా కనిపించినా, చివరికి ఓటమిపాలైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు ఎషాన్‌ మలింగ (4-0-29-3), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (4-0-31-2) సీఎస్‌కేకు అడ్డుకట్ట వేశారు. వీరి ధాటికి సీఎస్‌కే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)