Breaking News

సంచలనం.. 134 బంతుల్లోనే ట్రిపుల్‌ సెంచరీ చేసిన వైభవ్‌ సూర్యవంశీ స్నేహితుడు

Published on Wed, 06/18/2025 - 07:41

భారత క్రికెట్‌కు మరో చిచ్చరపిడుగు పరిచయమయ్యాడు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన 13 ఏళ్ల అయన్‌ రాజ్‌ కేవలం 134 బంతుల్లోనే ట్రిపుల్‌ సెంచరీ చేసి క్రికెట్‌ ప్రపంచాన్ని షేక్‌ చేశాడు. ఓ డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ 30 ఓవర్ల మ్యాచ్‌లో సంస్కృతి క్రికెట్‌ అకాడమీకి ప్రాతినిథ్యం వహించిన అయన్‌.. 134 బంతుల్లో 22 సిక్సర్లు, 41 ఫోర్ల సాయంతో 327 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయన్‌ బౌండరీలు, సిక్సర్ల రూపంలోనే 220.89 స్ట్రయిర్‌రేట్‌తో 296 పరుగులు చేయడం మరో విశేషం.

అయన్‌ రాజ్‌ భారత యువ సంచలనం, బ్యాటింగ్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీకి దగ్గరి మిత్రుడు. ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వారు. ఇంకా చిన్న వయసులో ఇద్దరు కలిసి ఆడారు. అయన్‌ వైభవ్‌ను ఆదర్శంగా తీసుకొని మరిన్ని సంచలన ప్రదర్శనలు నమోదు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయన్‌ను దగ్గరగా చూసిన వారు అతన్ని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు.

రికార్డు ట్రిపుల్‌ సెంచరీ తర్వాత ఎన్‌డీటీవీ స్పోర్ట్స్‌తో మాట్లాడిన అయన్‌ స్నేహితుడు వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్‌ భవిష్యత్తులో మరిన్ని సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తాడని అశాభావం వ్యక్తం చేశాడు. వైభవ్‌తో మాట్లాడిన ప్రతిసారి ప్రేరణతో కూడిన గొప్ప అనుభూతి కలుగుతుందని తెలిపాడు. వైభవ్‌ను చూసి ఫోకస్డ్‌గా ఎలా ఉండాలో నేర్చుకున్నానని అన్నాడు. వైభవ్‌ అడుగుజాడల్లో నడిచి తాను కూడా గొప్ప పేరు తెచ్చుకుంటానని తెలిపాడు.

తండ్రి కలను లక్ష్యంగా చేసుకొని..!
అయన్‌ తండ్రి ఓ మాజీ క్రికెటర్‌ (లోకల్‌). టీమిండియాకు ఆడాలని అతను కలలు కన్నాడు. అయితే అతని విషయంలో అది నెరవేరలేదు. కొడుకుతోనైనా తన కలను సాకారం చేసుకోవాలని అనుకున్నాడు. ఆ దిశగా అయన్‌ను రాటుదేలుస్తున్నాడు. అయన్‌ కూడా తండ్రి కలను లక్ష్యంగా చేసుకొని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తండ్రితో పాటు తల్లి మద్దతుతో కేవలం క్రికెట్‌పైనే దృష్టి కేంద్రీకరించాడు.

వైభవ్‌ విషయానికొస్తే.. అయన్‌ కన్నా ఏడాది పెద్దవాడైన వైభవ్‌ 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లోని అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. వైభవ్‌ ఐపీఎల్‌లో తన మూడో మ్యాచ్‌లోనే రికార్డు బ్రేకింగ్‌ సెంచరీ చేసి హేమాహేమీల రికార్డులు బద్దలు కొట్టాడు. గుజరాత్‌ టైటాన్స్‌పై వైభవ్‌ చేసిన 35 బంతుల శతకం ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో వేగవంతమైన శతకం. అలాగే ఐపీఎల్‌లో భారత ఆటగాడు చేసిన వేగవంతమైన శతకం. 

ఐపీఎల్‌ 2025కు ముందు వైభవ్‌ కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం అతని స్నేహితుడు అయన్‌ రాజ్‌ కూడా అతి చిన్నవయసులోనే పెద్దల క్రికెట్‌ ఆడే దిశగా అడుగులు వేస్తున్నాడు. అయన్‌ ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడటం కొనసాగిస్తే.. భారత క్రికెట్‌లో వైభవ్‌ తర్వాత మరో సంచలనం అవుతాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)