Breaking News

అక్ష‌ర్ ప‌టేల్ బుల్లెట్‌ త్రో.. పాక్ ఓపెనర్ మైండ్ బ్లాంక్‌! వీడియో వైరల్‌

Published on Sun, 02/23/2025 - 18:00

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ అక్షర్‌​ పటేల్ అద్బుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచాడు. అక్షర్‌​ సంచలన త్రోతో పాక్ ఓపెనర్‌​ ఇమామ్ ఉల్ హక్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 9 ఓ‍వర్‌లో బాబర్ ఆజం రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్‌లోనే ఇమామ్ ఉల్ హక్ దూరదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. పాక్ ఇన్నింగ్స్ పదో ఓవర్‌ వేసిన కుల్దీప్ యాదవ్‌ బౌలింగ్‌లో రెండో బంతికి ఇమామ్‌ మిడాన్‌ దిశగా ఆడాడు. షాట్ ఆడిన వెంటనే ఇమామ్‌ నాన్‌స్టైకర్‌ ఎండ్‌వైపు సింగిల్‌ కోసం ప్రయత్నించాడు.

కానీ మిడాన్‌లో ఉన్న అక్షర్‌ పటేల్‌ డైరక్ట్‌త్రోతో స్టంప్స్‌ను గిరాటేశాడు. ఇమామ్‌ డైవ్‌ చేసినప్పటికి ఫలితం మాత్రం లేకపోయింది.  దీంతో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఇమామ్‌ పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

అదేవిధంగా ఓ క్యాచ్‌ను అక్షర్ ఈ మ్యాచ్‌లో అందుకున్నాడు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న పాకిస్తాన్‌ తడబడుతోంది. 44 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్‌ 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఇప్పటివరకు హార్దిక్‌ పాండ్యా, ​కుల్దీప్‌ యాదవ్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా తలా వికెట్‌ సాధించారు.
చదవండి: IND vs PAK: టీమిండియా చెత్త రికార్డు.. ప్ర‌పంచంలోనే తొలి జ‌ట్టుగా

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)