Breaking News

కోహ్లి సెంచరీ కోసం లెక్కలు వేసుకున్నాను: అక్షర్‌ పటేల్‌

Published on Tue, 02/25/2025 - 08:40

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి ఆజేయ శతకంతో చెలరేగాడు. ఆఖరి వరకు క్రీజులో ఉండి తమ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

అయితే కోహ్లి తన 51 వ వన్డే సెంచరీని అందుకునే క్రమంలో కొంత ఉత్కంఠ నెలకొంది. మైదానంలోనూ, టీవీల ముందు అభిమానులు కూడా కోహ్లి సెంచరీ చేస్తాడా లేదా అనేదాని గురించే ఆసక్తిగా ఎదురు చూశారు.

వీరి పరిస్థితి ఇలా ఉంటే క్రీజ్‌లో మరోవైపు ఉన్న అక్షర్‌ పటేల్‌ పరిస్థితి ఎలా ఉంది! భారత్‌ విజయానికి 19 పరుగులు, కోహ్లి సెంచరీకి 14 పరుగులు కావాల్సిన స్థితిలో అక్షర్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను ఒక్క పెద్ద షాట్‌ ఆడి బౌండరీ సాధించినా లెక్క మారిపోయేది. అందుకే అతను పరుగులు తీయరాదనే అందరూ కోరుకున్నారు.

తాను కూడా ఇలాగే భావించినట్లు, కోహ్లి సెంచరీ కోసం లెక్కలు వేసుకున్నట్లు అక్షర్‌ వెల్లడించాడు. ‘మ్యాచ్‌ చివరికి వచ్చేసరికి నేను కూడా లెక్కలు వేయడం మొదలు పెట్టాను. బంతి నా బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకొని కూడా వెళ్లరాదని కోరుకున్నాను. ఆ సమయంలో అంతా సరదాగా అనిపించింది.

ఇంత తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్‌లో విరాట్‌ సెంచరీని డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి నేను చూడటం ఇదే మొదటిసారి. ఈ ఇన్నింగ్స్‌ను చాలా ఆస్వాదించాను. 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్‌ చేసిన తర్వాత వికెట్ల మధ్య అతను పరుగెత్తిన తీరు విరాట్‌ ఫిట్‌నెస్‌కు తార్కాణం’ అని అక్షర్‌ వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియా తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో మార్చి 2న దుబాయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)