Breaking News

చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్‌.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

Published on Mon, 12/09/2024 - 13:22

అడిలైడ్ వేదికగా భారత్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ విజ‌యంలో ఆసీస్  స్టార్ బ్యాట‌ర్ ట్రావిస్ హెడ్‌ది కీల‌క పాత్ర‌. మ‌రోసారి భార‌త్‌పై హెడ్ స‌త్తాచాటాడు. ఈ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హెడ్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో చెల‌రేగాడు. 

త‌న మెరుపు శ‌త‌కంతో మ్యాచ్‌ను కంగారూల వైపు తిప్పాడు. భార‌త బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. కేవ‌లం 111 బంతుల్లోనే త‌న సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా 141 బంతులు ఎదుర్కొన్న ట్రావిస్‌.. 4 సిక్స్‌లు, 17 బౌండ‌రీల‌తో 140 ప‌రుగులు చేశాడు. త‌న అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌కు గాను హెడ్ ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

ట్రావిస్‌ హెడ్‌ వరల్డ్‌ రికార్డు.. 
👉టీమిండియాపై పింక్‌, రెడ్‌, వైట్ బంతులతో జ‌రిగిన మ్యాచ్‌ల్లో సెంచ‌రీ చేసిన తొలి బ్యాట‌ర్‌గా హెడ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఫీట్ ఎవ‌రికి సాధ్యం కాలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌-2023లో భార‌త్‌పై తొలి రెడ్ బాల్ సెంచ‌రీని హెడ్ నమోదు చేశాడు.

 ఆ మ్యాచ్‌లో హెడ్ 163 ప‌రుగుల‌తో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఆ త‌ర్వాత వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2023 ఫైన‌ల్లో(వైట్‌బాల్‌) భార‌త్‌పై హెడ్ ఆజేయ సెంచ‌రీతో చెల‌రేగాడు. 137 ప‌రుగులు చేసి త‌మ జ‌ట్టును ఆరోసారి వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను అందించాడు. ఇప్పుడు పింక్‌బాల్‌తో జ‌రిగిన టెస్టులో కూడా త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే టీ20ల్లో మాత్రం భార‌త్‌పై హెడ్ సెంచరీ చేయలేదు.

👉అదే విధంగా డే అండ్ నైట్ టెస్ట్ చరిత్రలోనే అత్యంత వేగంగా శతకం బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన హెడ్‌..  త‌న రికార్డును త‌నే బ‌ద్దులు కొట్టాడు. 2022లో ఇంగ్లండ్‌తో హోబర్ట్ వేదికగా జరిగిన పింక్ బాల్ మ్యాచ్‌లో 112 బంతుల్లో శతకం సాధించాడు. 

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్