భారత మహిళల ‘ఎ’ జట్టు ఓటమి

Published on Mon, 08/25/2025 - 00:53

బ్రిస్బేన్‌: ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుతో జరిగిన ఏకైక అనధికారిక టెస్టులో భారత మహిళల ‘ఎ’ జట్టు 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 260/8తో చివరి రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత మహిళల ‘ఎ’ జట్టు 81.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు భారత జట్టు క్రితం రోజు స్కోరుకు 26 పరుగులు జోడించి మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది. 

ఆస్ట్రేలియా బౌలర్లలో అమీ ఎడ్గర్‌ 5 వికెట్లు పడగొట్టింది. అనంతరం 281 పరుగుల లక్ష్యఛేదనలో ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టు 85.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసి విజయం సాధించింది. రాచెల్‌ ట్రెనామన్‌ (143 బంతుల్లో 64; 6 ఫోర్లు), మ్యాడీ డార్క్‌ (116 బంతుల్లో 68; 6 ఫోర్లు), అనికా లిరాయ్డ్‌ (125 బంతుల్లో 72; 9 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. 

కెప్టెన్ తహిలా విల్సన్‌ (104 బంతుల్లో 46; 4 ఫోర్లు) సైతం రాణించింది. భారత మహిళల ‘ఎ’ జట్టు బౌలర్లలో సైమా ఠాకూర్‌ 2 వికెట్లు పడగొట్టింది. ఈ పర్యటనలో భాగంగా అంతకుముందు టి20 సిరీస్‌ను 0–3తో కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు... వన్డే సిరీస్‌ను 2–1తో చేజిక్కించుకుంది.  
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)