WTC Final 2025: 145 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి..!

Published on Thu, 06/12/2025 - 12:02

ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌ మైదానం వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న​ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-2025 ఫైనల్ ఓ అరుదైన ఘటనకు వేదికైంది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్ల నంబర్‌ వన్‌ ఆటగాళ్లు (ఓపెనర్లు) డకౌటయ్యారు. 

తొలుత ఆసీస్‌ ఆటగాడు ఉస్మాన్‌ ఖ్వాజా 20 బంతులు ఆడి రబాడ బౌలింగ్‌లో డకౌట్‌ కాగా.. ఆతర్వాత సౌతాఫ్రికా ప్లేయర్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ 6 బంతులు ఆడి ఖాతా తెరవకుండా స్టార్క్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

145 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లండ్‌ గడ్డపై ఇలా ఇరు జట్ల నంబర్‌ వన్‌ ఆటగాళ్లు టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ కావడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌తో కలుపుకొని ఇంగ్లండ్‌లో ఇప్పటివరకు 561 టెస్ట్‌ మ్యాచ్‌లు జరగగా.. ఇలాంటి ఘటన ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఒక్కసారి కూడా జరగలేదు. 1880లో తొట్ట తొలి అధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ ఇంగ్లండ్‌లోనే జరిగిన విషయం తెలిసిందే.

ఓవరాల్‌గా (ప్రపంచంలో ఎక్కడైనా) చూసినా ఓ టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్ల నంబర్‌ వన్‌ ఆటగాళ్లు డకౌట్లు కావడం ఇది 10వ సారి మాత్రమే. ఈ తరహా తొలి ఘటన 1977లో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో జరిగింది. 

ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు నంబర్‌ వన్‌ ఆటగాళ్లు సునీల్‌ గవాస్కర్‌, జాన్‌ డైసన్‌ డకౌట్లయ్యారు. ఆతర్వాత తాజా ఘటనతో కలుపుకొని ఇలాంటివి తొమ్మిది సార్లు జరిగాయి. ఇందులో చివరి నాలుగు సందర్భాలు కలుపుకొని ఆస్ట్రేలియా మొత్తంగా ఆరు సార్లు భాగమైంది. ఆసీస్‌ భాగమైన చివరి నాలుగు సందర్భాల్లో స్టార్క్‌ మూడింట భాగం​ కావడం (ప్రత్యర్ది వికెట్లు తీయడం) మరో విశేషం.

డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2025 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ తొలి రోజే 14 వికెట్లు పడ్డాయి. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 212 పరుగులకు ఆలౌట్‌ కాగా.. సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను రబాడ (5/51), జన్సెన్‌ (3/49),  కేశవ్‌ మహారాజ్‌ (1/19), మార్క్రమ్‌ (1/5) దెబ్బకొట్టగా.. సౌతాఫ్రికాను స్టార్క్‌ (2/10), హాజిల్‌వుడ్‌ (1/10), కమిన్స్‌ (1/14) ఇబ్బందుల్లోకి నెట్టారు.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ (66), బ్యూ వెబ్‌స్టర్‌ (72) టాప్‌ స్కోరర్లు కాగా.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యత బవుమా (3 నాటౌట్‌), బెడింగ్హమ్‌ (8 నాటౌట్‌) భుజస్కందాలపై ఉంది. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)