Breaking News

భార‌త్- ఆస్ట్రేలియా తొలి టీ20 వర్షార్పణం

Published on Wed, 10/29/2025 - 16:31

కాన్‌బెర్రా వేదిక‌గా భార‌త్‌-ఆస్ట్రేలియా మ‌ధ్య జరిగిన తొలి టీ20 వ‌ర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత టీమిండియాను బ్యాటింగ్ అహ్హ‌నించాడు. అయితే భార‌త ఇన్నింగ్స్ ఐద‌వ ఓవ‌ర్ ముగిసిన వెంట‌నే వ‌రుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఆట‌ను అంపైర్‌లు నిలిపివేశారు. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఆటను ప్రారంభించారు. 

అయితే మ్యాచ్‌ను మాత్రం 18 ఓవర్లకు కుదించారు. తిరిగి క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌, శుభ్‌మన్ గిల్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరు బ్యాటర్లు మంచి జోరు మీద ఉన్న సమయంలో వర్షం మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. భారత్‌ స్కోర్‌ 97/1(9.4 ఓవర్లు) వద్ద ఆటను నిలిపివేశారు.

అయితే ఈసారి వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో అంపైర్‌లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఫలితం తేలని ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌(39 నాటౌట్‌), శుభ్‌మన్ గిల్‌(37 నాటౌట్‌), అభిషేక్ శర్మ 19 పరుగులు చేశారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం జరగనుంది.

తుదిజట్లు:
టీమిండియా 
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా
మిచెల్ మార్ష్(కెప్టెన్‌), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్‌ కీపర్‌), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)