ఆసీస్‌ బౌలర్ల విజృంభణ

Published on Sat, 09/07/2024 - 20:18

ఎడిన్‌బర్గ్‌ వేదికగా స్కాట్లాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్‌ బౌలర్లు తలో చేయి వేసి స్కాట్లాండ్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశారు. 

స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో బ్రాండన్‌ మెక్‌ముల్లెన్‌ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. జార్జ్‌ మున్సే (25), ఓల్లీ హెయిర్స్‌ (12), మార్క్‌ వాట్‌ (18), మైఖేల్‌ లీస్క్‌ (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో కెమెరూన్‌ గ్రీన్‌ 3, ఆరోన్‌ హార్డీ, సీన్‌ అబాట్‌ తలో 2, స్టోయినిస్‌, జంపా చెరో వికెట్‌ పడగొట్టారు. అరంగేట్రం బౌలర్‌ కూపర్‌ కన్నోల్లీ 3 ఓవర్లు వేసి వికెట్‌ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు.

కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా స్కాట్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా ఘన విజయాలు సాధించింది. ఆతిథ్య జట్టు మూడో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తుంది.

ఈ సిరీస్‌ అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, ఐదు మ్యాచ్‌ వన్డే సిరీస్‌లు జరుగనున్నాయి. సెప్టెంబర్‌ 11 నుంచి ఈ సిరీస్‌లు మొదలుకానున్నాయి. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఇంగ్లండ్‌లో జరుగనున్నాయి. సెప్టెంబర్‌ 11, 13, 15 తేదీల్లో టీ20లు.. సెప్టెంబర్‌ 19, 21, 24, 27, 29 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి.

 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)