Breaking News

WTC Final 2025: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఆస్ట్రేలియా

Published on Thu, 06/12/2025 - 07:20

2023-2025 వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ లార్డ్స్‌ వేదికగా నిన్న (జూన్‌ 11) ప్రారంభమైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్‌కు చేరిన సౌతాఫ్రికా వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం పోరాడుతున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మొదలైంది. 

సౌతాఫ్రికా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ప్రొటీస్‌ ఫాస్ట్‌ బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా పతనమైంది. రబాడ (5/51), జన్సెన్‌ (3/49),  కేశవ్‌ మహారాజ్‌ (1/19), మార్క్రమ్‌ (1/5) ధాటికి 56.4 ఓవర్లలో 212 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ తొలి రోజు విరామం కాగానే ముగిసింది. 

67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను స్టీవ్‌ స్మిత్‌ (66), బ్యూ వెబ్‌స్టర్‌ (72) అర్ద సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 79 పరుగులు జోడించి ఆసీస్‌ గౌరవప్రదమైన స్కోర్‌ సాధించేందుకు దోహదపడ్డారు. వీరిద్దరు ఔటయ్యాక ఆసీస్‌ ఇన్నింగ్స్‌ మరోసారి పేకమేడలా కూలింది. 

మధ్యలో అలెక్స్‌ క్యారీ (23) కాసేపు పోరాడాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో స్మిత్‌, వెబ్‌స్టర్‌, క్యారీ కాక లబూషేన్‌ (17), ట్రవిస్‌ హెడ్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా 20 బంతుల డకౌట్‌తో ఆసీస్‌ పతనాన్ని మొదలుపెట్టాడు. 

ఈ మ్యాచ్‌తో ఖ్వాజాకు జోడీగా లబూషేన్‌తో ఓపెనింగ్‌ ప్రయోగం చేసినప్పటికీ సత్ఫలితం రాలేదు. ఖ్వాజాను రబాడ, లబూషేన్‌ను జన్సెన్‌ ఔట్‌ చేశారు. గాయం నుంచి కోలుకొని చాలాకాలం తర్వాత తిరిగి వచ్చిన కెమరూన్‌ గ్రీన్‌ (4) దారుణంగా విఫలమయ్యాడు. ఇతని వికెట్‌ కూడా రబాడకే దక్కింది. 

స్టీవ్‌ స్మిత్‌ను మార్క్రమ్‌, క్యారీని కేశవ​్‌ మహారాజ్‌.. హెడ్‌, లియోన్‌ను (0) జన్సెన్‌ ఔట్‌ చేశారు. వెబ్‌స్టర్‌, కమిన్స్‌ (1), స్టార్క్‌ (1) వికెట్లు రబాడ ఖాతాలోనే వెళ్లాయి.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌతాఫ్రికాకు కూడా ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్‌లోనే మార్క్రమ్‌ను స్టార్క్‌ డకౌట్‌ చేశాడు. జట్టు స్కోర్‌ 19 పరుగుల వద్ద ఉండగా మరో ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ను (16) స్టార్కే పెవిలియన్‌కు పంపాడు. 

వన్‌డౌన్‌ బ్యాటర్‌గా ప్రమోషన్‌ పొందిన వియాన్‌ ముల్దర్‌ (6) దారుణంగా విఫలమయ్యాడు. అతని వికెట్‌ కమిన్స్‌కు దక్కింది. అనంతరం వచ్చిన ట్రిస్టన్‌ స్టబ్స్‌ను (2) హాజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. దీంతో 30 పరుగులకే సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 

సౌతాఫ్రికాను గట్టెక్కించే బాధ్యత బవుమా (3), బెడింగ్హమ్‌ (8) భుజస్కందాలపై ఉంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ 43/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది. 

చెత్త రికార్డు
ఇదిలా ఉంటే, తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటైన ఆస్ట్రేలియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ ఫైనల్స్‌ చరిత్రలో అత్యల్ప తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ నమోదు చేసిన జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. 

గతంలో ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. తొలి డబ్ల్యూటీసీ (2019-2021) ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటివరకు భారత్‌ పేరిట ఉండిన ఈ చెత్త రికార్డును ఆసీస్‌ తమ ఖాతాలోకి వేసుకుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)