ఆస్ట్రేలియాకు ఘోర అవమానం

Published on Wed, 06/10/2026 - 21:16

ఆరు సార్లు విశ్వవిజేత, ప్రస్తుత డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కూడా అయిన ఆస్ట్రేలియా వన్డే జట్టుకు ఘోర అవమానం జరిగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న (జూన్‌ 9) జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయంపాలైన ఆ జట్టు.. మరో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ మాథ్యూ షార్ట్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో వరుసగా మూడో ఇన్నింగ్స్‌లోనూ ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడీ ఖాతా తెరవకుండానే కుప్పకూలింది.

ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఆస్ట్రేలియా ఓపెనర్లు రెండుసార్లు (చివరి రెండు వన్డేలు) ఒక్క పరుగు కూడా జోడించలేకపోయారు. తాజాగా బంగ్లాదేశ్ మ్యాచ్‌లోనూ అదే పరిస్థితి పునరావృతం కావడంతో, వన్డే చరిత్రలో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో ఓపెనింగ్ వికెట్‌కు ఖాతా తెరవని జట్ల జాబితాలో ఆస్ట్రేలియా చేరింది.

ఈ అవాంఛనీయ జాబితాలో ఇప్పటికే న్యూజిలాండ్‌ (2015) ఉండగా, తాజాగా ఆస్ట్రేలియా వారి సరసన నిలిచింది. అయితే అత్యంత చెత్త రికార్డు మాత్రం పసికూన పపువా న్యూ గినియా పేరిట ఉంది. 2022లో పపువా న్యూ గినియా వరుసగా నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఓపెనింగ్ వికెట్‌కు ఒక్క పరుగు కూడా నమోదు చేయలేదు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌ 86 పరుగుల తేడాతో సంచలన విజయం (డక్‌వర్త్‌ లూయిస్‌) సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. ఆరో నంబర్‌ ఆటగాడు మొసద్దెక్‌ హొస్సేన్‌ (86 నాటౌట్‌) సంచలన ఇన్నింగ్స్‌ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కుదేలైపోయారు.

బ్యాటింగ్‌లో సత్తా చాటిన మొసద్దెక్‌ (10-1-37-2) బౌలింగ్‌లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం​ అంతరాయం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో బంగ్లాదేశ్‌ను విజేతగా ప్రకటించారు.

36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్‌ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్‌కు షాకిచ్చింది.

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)