Breaking News

కుప్ప‌కూలిన ఆస్ట్రేలియా.. 99 ప‌రుగుల‌కే ఆలౌట్‌

Published on Wed, 10/21/2026 - 17:26

సెయింట్ జార్జ్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. ఆసీస్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 99 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో ఆతిథ్య ప్రోటీస్‌కు  326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే క‌నీసం 100 ప‌రుగుల మార్క్ కూడా దాట‌క‌పోవ‌డంతో ఆస్ట్రేలియాను ఫాలో ఆన్ ఆడించాల‌ని సౌతాఫ్రికా నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో ఆసీస్ త‌మ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.

నిప్పులు చెరిగిన సఫారీ పేసర్లు
సౌతాఫ్రికా పేసర్లు నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. యువ పేసర్ మార్కో యాన్సన్ (5/33) ఐదు వికెట్లతో చెలరేగి ఆసీస్ పతనాన్ని శాసించగా, కగిసో రబాడా, వియాన్ ముల్డర్ చెరో రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఏకంగా ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.

బవుమా భారీ సెంచరీ.. 
అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 425/9 వద్ద డిక్లేర్ చేసింది. ప్రోటీస్ కెప్టెన్ టెంబా బవుమా (179) భారీ సెంచరీతో జట్టుకు కొండంత స్కోరు అందించాడు. అతడికి తోడుగా మార్కో యాన్సన్ (85), సైమన్ హార్మర్ (82) అర్ధ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
చదవండి: IND vs NZ: పాపం వైభవ్‌ సూర్యవంశీ..! తేల్చి చెప్పిన టీమిండియా కెప్టెన్‌

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)