amp pages | Sakshi

WTC Final: ఆసీస్‌కు అక్కడ అంత సీన్‌ లేదు.. గెలుపు టీమిండియాదే..!

Published on Thu, 06/01/2023 - 18:59

భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మ‌ధ్య వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (డ‌బ్ల్యూటీసీ) 2021-23 ఫైన‌ల్ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వ‌ర‌కు సౌత్‌ లండన్‌లోని ఓవ‌ల్‌ మైదానం వేదిక‌గా జ‌రుగ‌నున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలతో పాటు ఇతర రికార్డుల విషయంలో ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ.. ఓ విషయం మాత్రం ఆసీస్‌ను తెగ కలవరపెడుతుంది.

అదేంటంటే.. ఇంగ్లండ్‌లోని మొత్తం వేదికల్లో ఓవ‌ల్ మైదానంలోనే ఆస్ట్రేలియాకు అతి తక్కువ స‌క్సెస్‌రేట్ ఉండ‌టం. 1880లో జరిగిన ఇనాగురల్‌ టెస్ట్‌ మ్యాచ్‌ నుంచి ఈ వేదికపై ఆసీస్‌ ఆడిన 38 మ్యాచ్‌ల్లో కేవలం ఏడింటిలో మాత్రమే విజయం సాధించింది. ఆ జట్టు విన్నింగ్‌ రేటియో ఈ మైదానంలో 18.42గా ఉంది. ఇంగ్లండ్‌ మొత్తంలో ఆసీస్‌ ఈ మైదానంలోనే అతి స్వల్ప సక్సెస్‌ రేట్‌ కలిగి ఉంది. గడిచిన 50 ఏళ్లలో ఓవల్‌లో ఆస్ట్రేలియా కేవలం రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. ఆసీస్‌కు ఇంగ్లండ్‌లో అత్యధికంగా లార్డ్స్‌లో అత్యధిక స‌క్సెస్ రేట్‌ (39.72) ఉంది.

మరోవైపు టీమిండియాకు సైతం ఓవల్‌లో పెద్ద మెరుగైన రికార్డు ఏమీ లేదు. భారత జట్టు ఇక్కడ ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే మాత్రమే విజ‌యం సాధించింది. భారత్‌.. చివ‌రిసారిగా ఇక్కడ 2021లో గెలుపొందింది. నాటి మ్యాచ్‌లో భారత్‌.. 157 ప‌రుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. 

రికార్డుల విషయం పక్కన పెడితే.. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడేందుకు భారత్‌, ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు ఇదివరకే లండన్‌కు చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొందేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. గెలుపుపై ఇరు జట్లు ధీమాగా ఉన్నప్పటికీ.. ఆసీస్‌తో పోలిస్తే టీమిండియాకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. గిల్‌, కోహ్లి, షమీ సూపర్‌ ఫామ్‌లో ఉండటం టీమిండియా అదనంగా కలిసొచ్చే అంశం.

చదవండి: ప్రపంచంలోకెల్లా సంపన్నమైన క్రికెట్‌ బోర్డు.. జెర్సీ స్పాన్సర్‌ చేసే నాథుడే లేడా..?

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌