Breaking News

T20 World Cup 2024: ఆల్‌రౌండ్‌ షోతో ఇరగదీసిన స్టోయినిస్‌.. బోణీ కొట్టిన ఆసీస్‌

Published on Thu, 06/06/2024 - 10:28

టీ20 వరల్డ్‌కప్‌ 2024 జర్నీని ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది. గ్రూప్‌-బిలో పసికూన ఒమన్‌తో ఇవాళ (జూన్‌ 6) జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

మార్కస్‌ స్టోయినిస్‌ ఆల్‌రౌండ్‌ షోతో (67 నాటౌట్‌, 3/19) ఇరగదీసి ఆసీస్‌ను గెలిపించాడు.  స్టోయినిస్‌ దెబ్బకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న ఒమన్‌ విలవిలలాడిపోయింది.

వివరాల్లోకి వెళితే.. బార్బడోస్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఒమన్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. స్టోయినిస్‌ (36 బంతుల్లో 67 నాటౌట్‌; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), వార్నర్‌ (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్స్‌) ఆదుకున్నారు. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో హెడ్‌ (12), మిచెల్‌ మార్ష్‌ (14), మ్యాక్స్‌వెల్‌ (0) నిరాశపరిచారు. ఈ మ్యాచ్‌లో ఒమన్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో ఆసీస్‌ భారీ స్కోర్‌ చేయలేకపోయింది. మెహ్రాన్‌ ఖాన్‌ 2, బిలాల్‌ ఖాన్‌, కలీముల్లా తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్‌.. ఆసీస్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమైంది. తొలుత బ్యాట్‌తో చెలరేగిన స్టోయినిస్‌ బంతితోనూ (3-0-19-3) రాణించాడు. 

జంపా (4-0-24-2), ఇల్లిస్‌ (4-0-28-2), స్టార్క్‌ (3-0-20-2) కూడా సత్తా చాటారు. ఒమన్‌ ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన అయాన్‌ ఖాన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలువగా..మరో ముగ్గురు రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)