Breaking News

రెండో టీ20లో బంగ్లా ఓటమి.. ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా

Published on Fri, 06/19/2026 - 19:56

ఛాటోగ్రామ్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన‌ రెండో టీ20లో 7 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో ఆసీస్‌ కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌పై ఆసీస్‌కు ఇదే తొలి టీ20 సిరీస్ గెలుపు కావ‌డం గ‌మానార్హం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి.  

ఓపెనర్లు జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్‌లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ కూపర్ కానోలి పవర్‌ప్లేలోనే అవుట్ కావడంతో ఆసీస్ 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మాట్‌ రెన్‌షా(52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89), టిమ్‌ డేవిడ్‌(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45) అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. 

వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ ఆఖరి వరకు పోరాడింది.  

బంగ్లాదేశ్ పవర్‌ప్లే ముగిసేసరికి 72/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. ఆ తర్వాత పర్వేజ్‌ హుస్సేన్‌(36), సైఫ్‌ హసన్‌(42) అవుట్ కావడంతో మ్యాచ్ ఆసీస్ వైపు మలుపు తిరిగింది. చివరిలో తౌహిద్ హృదయ్ పోరాడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. 

ఆసీస్ బౌలర్లలో ఆరోన్‌ హార్దీ రెండు, నాథన్‌ ఎల్లీస్‌, రెన్‌షా, జంపా, డేవిస్‌ తలా వికెట్ పడగొట్టారు. కాగా అంతకుముందు బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కంగారుల తేలిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీ20 సిరీస్ గెలుపుతో అందుకు మార్ష్ సేన ప్రతీకారం తీర్చుకుంది.
చదవండి: IPL 2027: యువరాజ్‌ సింగ్‌ ఐపీఎల్‌ రీఎంట్రీ?

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు