Breaking News

పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఆసీస్‌.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

Published on Sat, 01/06/2024 - 08:26

సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తన టెస్టు కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన డేవిడ్‌ వార్నర్‌ అద్బుతమైన హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు.

సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 74 బంతులు ఎదుర్కొన్న వార్నర్‌.. 7 ఫోర్లతో 57 పరుగులు చేశాడు. అతడితో పాటు మార్నస్‌ లబుషేన్‌(62) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఇక 68/7 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్తాన్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 14 పరుగుల అధిక్యాన్ని కలుపుకుని ఆసీస్‌ ముందు 130 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ నిలిపింది. ఆసీస్‌ బౌలర్లలో హాజిల్‌ వుడ్‌ 4 వికెట్లతో పాక్‌ను దెబ్బతీయగా..  లయోన్‌ 3 వికెట్లు, స్టార్క్‌, కమ్మిన్స్‌, హెడ్‌ తలా వికెట్‌ సాధిం‍చారు.

కాగా అంతకముందు ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటర్లలో లబుషేన్‌(60) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లబుషేన్‌తో పాటు మిచెల్‌ మార్ష్‌(54), ఖావాజా(47) పరుగులతో రాణించారు. పాక్‌ బౌలర్లలో అమీర్‌ జమీల్‌ 6 వికెట్లతో సత్తాచాటాడు. కాగా పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఆలౌటైంది.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?