వందో మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన వార్నర్‌.. తొలి టీ20 ఆసీస్‌దే

Published on Fri, 02/09/2024 - 19:25

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌ చివరివరకు అద్భుతంగా పోరాడింది. వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ చూస్తే ఎంతటి భారీ స్కోర్‌లనైనా ఛేదిస్తుందని అనిపించింది. జట్టులో దాదాపుగా అందరూ బ్యాట్‌తో మెరుపులు మెరిపించగల సమర్ధులే. ఇంతటి విధ్వంసకర బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్నా విండీస్‌ ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. కెరీర్‌లో వందో మ్యాచ్‌ ఆడుతున్న డేవిడ్‌ వార్నర్‌ (70) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.  జోష్‌ ఇంగ్లిస్‌ (39), టిమ్‌ డేవిడ్‌ (37 నాటౌట్‌), వేడ్‌ (21) వేగంగా పరుగులు సాధించగా.. మిచెల్‌ మార్ష్‌ (16), మ్యాక్స్‌వెల్‌ (10), స్టోయినిస్‌ (9), అబాట్‌ (0) నిరాశపరిచారు. విండీస్‌ బౌలరల్లో రసెల్‌ 3 వికెట్లు, అల్జరీ జోసఫ్‌ 2, హోల్డర్‌, షెపర్డ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌.. నిర్ణీత ఓవర్లలో 202 పరుగులకు పరిమితమై (8 వికెట్లు కోల్పోయి) 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్‌ ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌ (53), జాన్సన్‌ చార్లెస్‌ (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చివారు తుస్సుమనిపించడంతో విండీస్‌ చేతులెత్తేసింది.

ఆఖర్లో జేసన్‌ హోల్డర్‌ (34 నాటౌట్‌) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి విండీస్‌ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. పూరన్‌ (18), పావెల్‌ (14), హోప్‌ (16), రసెల్‌ (1), రూథర్‌ఫోర్డ్‌ (7), షెపర్డ్‌ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో జంపా 3, స్టోయినిస్‌ 2, బెహ్రెన్‌డార్ఫ్‌, మ్యాక్స్‌వెల్‌, అబాట్‌ తలో వికెట్‌ పడగొట్టారు. రెండో టీ20 ఫిబ్రవరి 11న అడిలైడ్‌లో జరుగనుంది.

Videos

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)