Breaking News

స్టోయినిస్‌ ఊచకోత.. పాక్‌ను ఊడ్చేసిన ఆస్ట్రేలియా

Published on Mon, 11/18/2024 - 16:33

స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌ స్వీప్‌ చేసింది. సిరీస్‌లో భాగంగా ఇవాళ (నవంబర్‌ 18) జరిగిన మూడో టీ20లో ఆసీస్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. 18.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. పాక్‌ ఇన్నింగ్స్‌లో బాబర్‌ ఆజమ్‌ (41) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. హసీబుల్లా ఖాన్‌ (24), షాహీన్‌ అఫ్రిది (16), ఇర్ఫాన్‌ ఖాన్‌ (10) రెండంకెల స్కోర్లు చేశారు. 

ఆసీస్‌ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించి పాక్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆరోన్‌ హార్డీ మూడు వికెట్లతో పాక్‌ నడ్డి విరచగా.. ఆడమ్‌ జంపా, స్పెన్సర్‌ జాన్సన్‌ తలో రెండు వికెట్లు.. జేవియర్‌ బార్ట్‌లెట్‌, నాథన్‌ ఇల్లిస్ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ కేవలం 11.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది (3 వికెట్లు కోల్పోయి). మార్కస్‌ స్టోయినిస్‌ 27 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి పాక్‌ బౌలర్లను చీల్చిచెండాడు. జోష్‌ ఇంగ్లిస్‌ 24 బంతుల్లో 27 పరుగులు.. జేక్‌ ఫ్రేజర్‌ 11 బంతుల్లో 18 పరుగులు.. టిమ్‌ డేవిడ్‌ 3 బంతుల్లో 7 పరుగులు.. మాథ్యూ షార్ట్‌ 4 బంతుల్లో 2 పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది, జహన్‌దాద్‌ ఖాన్‌, అబ్బాస్‌ అఫ్రిదిలకు తలో వికెట్‌ దక్కింది. 

కాగా, ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా గెలుపొందిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌కు ముందు జరిగిన వన్డే సిరీస్‌ను పాక్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)