న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌

Published on Mon, 03/11/2024 - 08:47

టెస్టుల్లో ఆస్ట్రేలియా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో3 వికెట్ల తేడాతో ఆసీస్‌ విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా క్లీన్‌ స్వీప్‌ చేసింది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఆసీస్‌ విజయంలో ఆ జట్టు వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ(98 నాటౌట్‌), మిచెల్‌ మార్ష్‌(80) కీలక పాత్ర పోషించారు. లక్ష్య ఛేదనలో 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఆసీస్‌ కష్టాల్లో పడింది. ఈ సమయంలో మార్ష్‌,క్యారీ జట్టును అందుకున్నారు. ఆచతూచి ఆడుతూ జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే ఆఖరిలో మార్ష్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ కాస్త కివీస్‌ వైపు మలుపు తిరిగింది.

కానీ క్రీజులో పాతుకుపోయిన  క్యారీ, కెప్టెన్‌ కమ్మిన్స్‌తో కలిసి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో బెన్‌ సీర్స్‌ 4 వికెట్లు, మాట్‌ హెన్రీ రెండు, టిమ్‌ సౌథీ తలా వికెట్‌ సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్లాక్‌ క్యాప్స్‌ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 256 పరుగులు చేసింది. ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 372 పరుగులు చేసిన కివీస్‌.. ఆసీస్‌ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

చదవండి:IPL 2024: వారెవ్వా సంజూ.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌! వీడియో వైరల్‌

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)