Breaking News

నిప్పులు చెరిగిన విండీస్‌ పేసర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన ఆస్ట్రేలియా

Published on Thu, 06/26/2025 - 15:32

3 టెస్ట్‌లు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా నిన్న (జూన్‌ 25) తొలి టెస్ట్‌ మొదలైంది. బార్బడోస్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు పేసర్ల హవా కొనసాగింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియాను విండీస్‌ పేసర్లు జేడన్‌ సీల్స్‌ (15.5-1-60-5), షమార్‌ జోసఫ్‌ (16-3-46-4) వణికించారు. ఈ ఇద్దరి ధాటికి ఆస్ట్రేలియా 180 పరుగులకే కుప్పకూలింది. 

గడిచిన 30 ఏళ్లలో వెస్టిండీస్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప స్కోర్‌. సీల్స్‌, షమార్‌తో పాటు జస్టిన్‌ గ్రీవ్స్‌ కూడా ఓ వికెట్‌ తీయడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ పరిసమాప్తమైంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ట్రవిస్‌ హెడ్‌ (59) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ఉస్మాన్‌ ఖ్వాజా 47 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు కాక కెప్టెన్‌ కమిన్స్‌ (28), వెబ్‌స్టర్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

మిగతా ఆటగాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. సామ్‌ కొన్‌స్టాస్‌ 3, కెమారూన్‌ గ్రీన్‌ 3, జోస్‌ ఇంగ్లిస్‌ 5, అలెక్స్‌ క్యారీ 8, మిచెల్‌ స్టార్క్‌ 0, హాజిల్‌వుడ్‌ 4 పరుగులకు ఔటయ్యారు. నాథన్‌ లియోన్‌ 9 పరుగులతో అజేయంగా నిలిచాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌ కూడా ఆసీస్‌ తరహాలోనే త్వరితగతిన వికెట్లు కోల్పోయింది. ఆసీస్‌ పేసర్లు స్టార్క్‌ (7-1-35-2), హాజిల్‌వుడ్‌ (7-1-13-1), కమిన్స్‌ (6-2-8-1) ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు విండీస్‌ ఇంకా 123 పరుగులు వెనుకపడి ఉంది. 

విండీస్‌ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ 4, జాన్‌ క్యాంప్‌బెల్‌ 7, కీసీ కార్టీ 20, జోమెల్‌ వార్రికన్‌ 0 పరుగులకు ఔట్‌ కాగా.. బ్రాండన్‌ కింగ్‌ (23), రోస్టన్‌ ఛేజ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. బ్రాత్‌వైట్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత రోస్టన్‌ ఛేజ్‌ విండీస్‌ టెస్ట్‌ జట్టు సారధిగా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా ఇదే అతనికి తొలి మ్యాచ్‌.

దిగ్గజాలు సరసన సీల్స్‌
ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన విండీస్‌ రైట్‌ ఆర్మ్‌ సీమర్‌ జేడన్‌ సీల్స్‌ దిగ్గజాల సరసన చేరాడు. బార్బడోస్‌ మైదానంలో (కెన్నింగ్‌స్టన్‌ ఓవల్‌) ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నాలుగో విండీస్‌ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

సీల్స్‌కు ముందు కోట్నీ వాల్ష్‌ (5-39), మాల్కమ్‌ మార్షల్‌ (5-42), డెనిస్‌ అట్కిన్సన్‌ (5-56) మాత్రమే బార్బడోస్‌లో ఆసీస్‌పై ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. మైఖేల్‌ హోల్డింగ్‌ లాంటి దిగ్గజానికి కూడా ఈ ఘనత సాధ్యం​ కాలేదు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)